IIIT Admission Entrance Test Schedule
Released (RGUKT)
ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి ఉమ్మడి
పరీక్ష తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 28వ
తేదీ పదో తరగతి సిలబస్ ఆధారంగా IIIT
పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ ఐదో తేదీన పరీక్ష
ఫలితాలు వెలువడును. ప్రతి మండల కేంద్రంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు ఇస్తామని
అలాగే హైదరాబాద్ నందు కూడా సెంటర్లను ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి
ఆదిమూలం సురేష్ కుమార్ గారు తెలియజేశారు.
ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ కోర్సులలో
ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాజీవ్ గాంధీ
యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీలలో పదో
తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు.
కరోనా వైరస్ కారణంగా ఎస్ఎస్ సీ బోర్డు
పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఆర్జీయూకేటీ చట్టంలో మార్పులు చేసి ఉమ్మడి ప్రవేశ పరీక్ష
నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం
ఉత్తర్వులు జారీ చేశారు. (G.O.RT.No.
152)
0 Komentar