Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Incredible benefits of drinking cow milk

 


Incredible benefits of drinking cow milk

ఆవు పాలు తాగొచ్చా? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

ఆవు పాలు ఆరోగ్యానికి మంచివేనా? అవి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. ఆవు పాల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేమిటీ? 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది గేదె పాలనే ఇష్టంగా తాగుతారు. ఆవు పాలతో పోల్చితే ఇవి ఎక్కువ అందుబాటులో ఉండటమే కాకుండా త్వరగా జీర్ణమవుతాయనే భావిస్తారు. అయితే, ఇటీవల ఆవు పాల వినియోగం కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆవు పాలు, ఆవు నెయ్యిని పవిత్రంగా భావించే ప్రజలు.. ఇప్పుడు క్రమేనా రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. మరి, ఆవు పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ప్రయోజనాలేమిటీ? దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? తదితర వివరాలు మీ కోసం. 

ఆవు పాలలో అత్యధిక లాక్టోస్ శరీరం జీర్ణం చేసుకోలేదనే అభిప్రాయం ఉంది. అయితే, యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) అధ్యయనం ప్రకారం.. ఆవు పాల్లలో బోలెడన్ని పోషకాలు, A, D విటమిన్లు ఉన్నాయని, ఎముకులకు బలాన్నీ చేకూర్చే కాల్షియం పుష్కలంగా ఉందని పేర్కొంది. ఆవు పాలలో ఉండే ప్రోటీన్లు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయని స్పష్టం చేసింది. ఆవు పాలల్లో జింక్, అయోడిన్, ఐరన్ సైతం ఆవు పాలతో అందుతాయి. అయితే, ఆవు పాలల్లో ఉండే కొవ్వు మాత్రం అంత మంచిది కాదనిన స్పష్టం చేస్తున్నారు. ఆవు పాలు కొందరిలో అలర్జీకి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. 

ఆవుపాల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు:

ఆయుర్వేదంలో ఆవుపాలను ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తున్నారు.

అజీర్ణ సమస్యలతో బాధపడేవారికి లాక్టోస్ వల్ల సమస్యలు తప్పుతాయి. అలాంటి వారు ఆవుపాలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

ఆవు పాలలో ఆరోగ్యాన్ని అందించే తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయట.

ఆవుపాలలో ఉండే కాల్షియం వల్ల ఎముకులు, కండరాలు దృఢంగా ఉంటాయట.

బోలు ఎముకల వ్యాధి, అస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు వైద్యుల సూచనల ప్రకారం ఆవు పాలను తీసుకోవాలని చెబుతున్నారు. 

ఆవుపాలలో ప్రోటీన్లతో పాటు, విటమిన్ డి, భాస్వరం, మెగ్నీషియం మెండుగా ఉంటాయట.

ఆవు పాలలోని విటమిన్-బి నరాలను రిలాక్స్ చేసి మంచి నిద్రను అందిస్తాయట. అందుకే, చాలామంది నిద్రకు ముందు పాలు తాగుతారు.

ఆవు పాలలోని విటమిన్-బి12 జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయట. పిల్లలకు ఈ పాలు మంచివే అంటున్నారు.

ఆవు పాలు శరీరం జీవక్రియను సైతం మెరుగుపరుస్తాయట.

ఆవు పాలలోని కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట. 

గమనిక: పై వివరాలను వివిధ అధ్యయనాలు, వివిధ జర్నల్‌లో ప్రచురించిన వివరాలు ఆధారంగా అందించామని గమనించగలరు. ఇవన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఆవు పాలను మీ డైట్‌లో చేర్చుకొనే ముందు తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలను వైద్యానికి ప్రత్యామ్నయం లేదా ఆధారాలుగా భావించరాదని మనవి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు.

Previous
Next Post »
0 Komentar

Google Tags