India ranks 6th most positive about
teachers in 35-country global survey
భారత్ లో ఉపాధ్యాయులకు సముచిత
గౌరవం
- సర్వేలో వెల్లడి
భారత్ లో ఉపాధ్యాయులకు సముచిత
గౌరవం లభిస్తోంది. వారంటే ప్రజల్లో నమ్మకం ఉంది. బ్రిటన్‌కు చెందిన వార్కే ఫౌండేషన్
జరిపిన అధ్యయనంలో ఉపాధ్యాయులను విశ్వసించే విషయంలో భారత్ కు ఆరో స్థానం లభించింది.
మొదటి స్థానంలో చైనా, తరువాతి స్థానాల్లో ఘనా, సింగపూర్, కెనడా, మలేసియాలు
ఉన్నాయి. మొత్తం 35 దేశాల్లో సర్వే జరిపింది. ఉపాధ్యాయులు నమ్మకస్థులా, కాదా?
ప్రేరణ కలిగిస్తారా, లేదా
బాధ్యత తీసుకుంటారా, లేదా? మేదావులా,
కాదా.. అంటూ తక్షణ జవాబులు ఇచ్చే ప్రశ్నలు అడిగింది. తద్వారా
మనసులోని అభిప్రాయాలను రాబెట్టింది.
"ఉపాధ్యాయులను గౌరవించడం నైతిక బాధ్యత
కాదు. విద్యారంగ ఫలితాలకు అత్యవసరమని ఈ నివేదిక నిరూపించింది" అని వార్కే
ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కే తెలిపారు. ఉపాధ్యాయునికి ఇచ్చే గౌరవానికి
విద్యార్ధి సాధించే విజయానికి సంబంధం ఉందని చెప్పారు. విద్యారంగం పై ప్రభుత్వం
వెచ్చించే నిధులకు, ఉపాధ్యాయునికి లభించే గౌరవానికి కూడా
సంబంధం ఉంది. ఘనాలో మొత్తం ప్రభుత్వ వ్యయంలో 22.1 శాతం నిధులు విద్యపై ఖర్చు
చేస్తుండగా, ఆ దేశం ప్రస్తుత సర్వేలో రెండో ర్యాంకు
పొందింది. భారత్ లో 14 శాతం మేర ప్రభుత్వ నిధులు వ్యయం అవుతున్నాయి. ఇటలీలో 8.1
శాతం నిధులు ఖర్చు చేస్తుండగా, ఆ దేశానికి 24వ ర్యాంకు
వచ్చింది.
0 Komentar