Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Oil Corporation Jobs - Diploma Qualification

 

Indian Oil Corporation Jobs - Diploma Qualification

డిప్లొమా అర్హతతో జాబ్స్‌.. ఇండియన్‌‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగాలకు ప్రకటన

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 57 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వ మ‌హార‌త్న సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 57 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ప‌్రొడ‌క్ష‌న్‌, మెకానిక‌ల్ ఫిట్ట‌ర్ క‌మ్ రిగ్గ‌ర్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ తదితర విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. రాత‌ప‌రీక్ష‌, స్కిల్‌/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 7 దరఖాస్తుకు చివరితేది. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు https://iocl.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 57

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌-56

జూనియ‌ర్ క్వాలిటీ కంట్రోల్ అన‌లిస్ట్‌-01 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా(ఇంజినీరింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 31.10.2020 నాటికి 18-26 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్‌/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప‌రీక్ష తేది: నవంబర్‌ 29, 2020.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 07, 2020.

వెబ్‌సైట్‌: https://iocl.com/

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags