Indian-origin Srikant Datar named Dean
of Harvard Business School
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా
మన భారతీయుడు
ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్
స్కూల్ డీన్‌గా రెండోసారి మన భారతీయుడు నేతృత్వం వహించనున్నాడు.
సత్యనాదెళ్ల, ఇంద్రానూయి, సుందర్ పిచాయ్.. వీళ్లంతా మన భారతీయులే.. కానీ విదేశీ సంస్థలను పరిపాలిస్తున్నారు. భారత దేశ గొప్పదనం ఏమిటో.. భారతీయుల తెలివితేలు, నైపుణ్యాలు ఏపాటివో ప్రపంచానికి చాటిచెబుతున్నారు. తాజాగా ఈ కోవలోకి మరో భారత సంతతి వ్యక్తి చేశారు.
ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా భారత సంతతికి చెందిన విద్యావేత్త శ్రీకాంత్ దాతర్ నియమితులయ్యారు. 112 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఇనిస్టిట్యూషన్‌కు నేతృత్వం వహించనున్న రెండో భారతీయుడు శ్రీకాంత్ కావటం విశేషం. ప్రస్తుతం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా నితిన్ నోహ్రియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2021 జనవరి 1న శ్రీకాంత్ దాతర్.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌గా బాధ్యతలు
స్వీకరిస్తారని ప్రెసిడెంట్ లారీ బాకో వెల్లడించారు. శ్రీకాంత్.. బాంబే
విశ్వవిద్యాలయం, అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్ధి కావడం
విశేషం.
0 Komentar