Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Railways Alert: From 10 October, second reservation chart 30 minutes before departure




 Indian Railways Alert: From 10 October,  2nd reservation chart will be issued 30 min before departure  - Details Here
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఆ నియమాలు అక్టోబర్ 10 నుండి అమలులోకి!
ట్రైన్ జర్నీ చేసే వారికి ముఖ్యమైన అలర్ట్. ఇండియన్ రైల్వేస్ మళ్లీ ఆ రూల్స్‌ను అమలులోకి తీసుకురాబోతోంది. రిజర్వేషన్ రూల్స్‌ను అక్టోబర్ 10 నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రయాణికులకు ఊరట కలుగనుంది.

మళ్లీ ఆ రూల్స్ వర్తింపు
అక్టోబర్ 10 నుంచి అమలులోకి

ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ రూల్స్‌ను సవరించింది. రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలను సరళీకరించింది. కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రూల్స్ మార్పు వల్ల ప్రయాణికులకు ఊరట కలుగనుంది.

ఇండియన్ రైల్వేస్ కొత్త రూల్స్ ప్రకారం.. సెకండ్ రిజర్వేషన్ చార్ట్ కూడా ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ట్రైన్ బయలుదేరడానికి 30 నిమిషాల ముందుగానే సెకండ్ రిజర్వేషన్ చార్ట్‌ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. అన్ని జోనల్ రైల్వేస్ సూచనల మేరకు ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే ఇండియన్ రైల్వేస్ ఈ కొత్త రూల్ తీసుకురావడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఫస్ట్ రిజర్వేషసన్ చార్ట్ రెడీ అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న సీట్లును ప్రయాణికులు మళ్లీ బుకింగ్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్ పూర్తయిన తర్వాత రెండో రిజర్వేషన్ చార్ట్ రెడీ అవ్వడానికి ముందుగా మిగిలిన సీట్లను ఆన్‌లైన్ లేదా పీఆర్ఎస్ కౌంటర్‌లో బుక్ చేసుకోవచ్చు. 
ఇకపోతే కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ సెకండ్ రిజర్వేషన్ చార్ట్‌ను ట్రైన్ బయలుదేరడానికి 2 గంటల ముందే రెడీ చేస్తోంది. ఇది తాత్కాలికం మాత్రమే. అక్టోబర్ 10 నుంచి రెండో రిజర్వేషన్ చార్ట్ ట్రైన్ బయలుదేరడానికి 30 నిమిషాల ముందే సిద్ధమౌతుంది. ఇకపోతే రైల్వేస్ తొలి రిజర్వేషన్ చార్ట్‌ను ట్రైన్ బయలు దేరడానికి 4 గంటల ముందే రెడీ చేస్తుంది. కాగా ఇండియన్ రైల్వేస్ కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్న విషయం తెలిసిందే. 

ఇకపోతే కోవిడ్ 19కు ముందు.. తొలి రిజర్వేషన్ చార్ట్ ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు రెడీ అవుతుంది. అదేసమయంలో రెండో రిజర్వేషన్ చార్ట్ ట్రైన్ బయలు దేరడానికి 5 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో రెడీ అయ్యేది. అంతేకాకుండా టికెట్ బుక్ చేసుకున్న వారు రెండో రిజర్వేషన్ చార్ట్ రెడీ అవ్వడానికి ముందు వరకు టికెట్లను క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags