ఐఓసీఎల్‌లో ఆఫీసర్,
ఇంజినీర్ పోస్టులు.. రూ.50 వేల జీతం..!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
లిమిటెడ్ (IOCL) ఆఫీసర్ లేదా ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది.
గేట్-2021 స్కోర్ ద్వారా భర్తీ
త్వరలో పోస్టుల సంఖ్య, దరఖాస్తు
తేదీల వెల్లడి
దేశంలో అగ్రశ్రేణి ముడిచమురు
సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఆఫీసర్ లేదా
ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను గేట్-2021
స్కోర్ ద్వారా భర్తీచేయనుంది. ఆస్తకి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య, దరఖాస్తు తేదీలను త్వరలో
ప్రకటిస్తారు.
ఇందులో కెమికల్, సివిల్,
ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్,
మెకానికల్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు
పూర్తివివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో
బీటెక్ లేదా బీఈ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. గేట్-2021లో అర్హత
సాధించాలి.
ఎంపిక విధానం: గేట్-2021లో వచ్చిన
మార్కుల ఆధారంగా. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కన్ లేదా గ్రూప్
టాస్క్,
పర్సనల్ ఇంటర్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
గేట్-2021 దరఖాస్తుకు చివరితేదీ:
అక్టోబర్ 7, 2020
ఆలస్య రుసుముతో గేట్-21 దరఖాస్తులకు
చివరితేదీ: అక్టోబర్ 12, 2020
గేట్-2021 అడ్మిట్ కార్డు: 2021, జనవరి
8
గేట్ పరీక్ష తేదీలు: 2021, ఫిబ్రవరి
5 నుంచి 7 వరకు, ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు
గేట్ పరీక్ష ఫలితాలు: మార్చి 22, 2021
ఐఓసీఎల్ దరఖాస్తులు: తేదీలను
త్వరలో ప్రకటిస్తారు.
0 Komentar