Is gas cylinder subsidy money coming
into the account? This is the real reason!
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు
అకౌంట్‌లోకి రావడం లేదా? ఇదే అసలు కారణం!
మీరు గ్యాస్ సిలిండర్ బుక్
చేస్తున్నారా? అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇటీవల కాలంలో
గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత డెలివరీ తర్వాత గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్‌లోకి
రావడం లేదు.
గ్యాస్ సబ్సిడీ బంద్
అయితే తాత్కాలికమే
గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారు ఒక
విషయం తెలుసుకోవాలి. గత ఐదు నెలలుగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు రావడం లేదు.
ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. లేదంటే గమనించి ఉండకపోవచ్చు. మీడియా
నివేదికల ప్రకారం.. 2020 మే నెల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై
సబ్సిడీ డబ్బులు వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లలోకి రావడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అందించడం మానేసిందని అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఇది
నిజం కాదు. సబ్సిడీ డబ్బులు రాకపోవడానికి వేరే కారణం ఉంది. గతంలో పోలిస్తే ఎల్‌పీజీ
గ్యాస్ సిలిండర్ ధరలు తక్కువగానే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు సబ్సిడీ డబ్బులు రావడం
లేదు.
అయితే ఇక్కడ గత నెలలో కొంత మందికి
మాత్రం కేవలం రూ.27 వరకు సబ్సిడీ డబ్బులు వచ్చాయి. కేంద్ర
ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో మార్కెట్‌లో
సబ్సిడీ సిలిండర్ ధర, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర దాదాపు
సమంగానే ఉంది. దీంతో గ్యాస్ వినియోగదారుల ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులు రావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా
సబ్సిడీ సిలిండర్ ధరకు, నాన్ సబ్సిడీ సిలిండర్ ధరకు మధ్య ఉన్న
వ్యత్యాసం డబ్బులను మళ్లీ కస్టమర్లకు సబ్సిడీ రూపంలో అందించేది. అయితే ఇప్పుడు
రెండే సమానం కావడంతో సబ్సిడీ డబ్బులు రావడం లేదు. అంటే గ్యాస్ సిలిండర్ ధర
పెరిగితే మళ్లీ సబ్సిడీ డబ్బులు వస్తాయి.
0 Komentar