Jagananna Vidya Kanuka Starts Today
'జగనన్న విద్యా కానుక'
నేడే - కృష్ణా జిల్లా పునాదిపాడులో ప్రారంభం
ప్రభుత్వం చేపడుతున్న జగనన్న
విద్యా కానుక కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పునాది పాడులో గురువారం సీఎం జగన్
ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 42, 34, 322 విద్యార్థులకు
కిట్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల ఏకరూపదుస్తులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, 1-5 తరగతుల చిన్నారులకు వర్కబుక్సు, 8-10 తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు
కిట్టుగా అందిస్తారు. వీటితోపాటు ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు ఇస్తారు. కోవిడ్-19
కారణంగా భౌతికదూరం పాటిస్తూ ప్రతి పాఠశాలలో మూడు రోజుల్లో కిట్ల పంపిణీ పూర్తి
చేయాలని పాఠశాల విద్య సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశించారు.. బ్యాగు, బూట్లు, బెల్టు, ఏకరూపదుస్తులు
సరైన సైజుల్లో రాక పోయినా పంపిణీ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులు,
వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, వెంటనే
ప్రధానోపాధ్యాయుడిని లేదా ఎంఈవోని సంప్రదించాలని సూచించారు. అవసరమైతే హెల్ప్ లైన్
నంబర్లు 9121296051, 9121296052కు ఫోన్ చేసి తెలుసుకో
వాలన్నారు. గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు,
వస తిగృహాల్లో చదువుతున్న విద్యార్థుల కిట్లను ఆయా బడులకు సరఫరా |
చేశామని, పాఠశాలకు వెళ్లి తీసుకోవాలని కోరారు.
0 Komentar