Jal Jeevan Mission: Provide safe and adequate drinking water to every house
ప్రతి ఇంటికి రక్షిత నీరే జలజీవన్
మిషన్ లక్ష్యం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ప్రతి ఇంటి పైపుల ద్వారా రక్షిత
నీరు అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ అన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు, అంగన్‌వాడీ కేంద్రానికి
పైపుల ద్వారా రక్షిత నీరు అందించాలన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన జలజీవన్
మిషన్ 100 రోజులు ప్రచారోద్యమం అమలు తీరుపై ఆయన రాజ్ భవన్ నుంచి సోమవారం ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్సు
ద్వారా సమీక్షించారు. నిర్దిష్ట గడువులోగా 100 రోజుల ప్రదారోద్యమాన్ని అన్ని
పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పూర్తి చేయాలని సూచించారు.
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ, పాఠశాలలకు,
అంగన్‌వాడీ కేంద్రాలకు, పంచాయతీ భవనాలకు వైపుల
ద్వారా నీటి సర ఫరా కోసం సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. స్కూళ్లలో
45శాతం, ఆంగన్‌వాడీ కేంద్రాల్లో విశాతం మేర నాడు నేడు -
కార్యక్రమం కింద 100శాతం రక్షిత నీరు అందిస్తున్నామని చెప్పారు. డిసెంబరు నెలాఖరు
నాటికి స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 100 రోజుల
ప్రచారోద్యమాన్ని పూర్తి చేస్తామని నీలం సాహ్ని చెప్పారు.
0 Komentar