Japan plans to build a hydrogen fuel
plant on the moon
చంద్రుడిపై ఫ్యూయల్ ఫ్యాక్టరీ
నిర్మించనున్న జపాన్
చంద్రుడి సహా అంగారక గ్రహంపై జీవజాలం, నీటి జాడల గుర్తింపు కోసం పలు దేశాలు ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నాయి. తాజాగా, చంద్రుడిపైనే ఫ్యూయల్ ఫ్యాక్టరీకి జపాన్ శ్రీకారం చుట్టనుంది.
చంద్రుడి ఉపరితల వాతావరణ
పరిస్థితులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ నీటి జాడల కోసం ముమ్మర అన్వేషణలు
సాగుతున్నాయి. చంద్రుడిపై నీటి ఆనవాళ్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన
చంద్రయాన్-1 ఇప్పటికే గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు నీరు.. మంచు
రూపంలో ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భావిస్తోంది. ఈ
ప్రదేశంలోని వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి
మెట్టుపై విఫలమయ్యింది. అయితే, ఈ మంచునే ఇంధనంగా మార్చాలని జపాన్
స్పేస్ ఎక్స్‌ప్లోరేటరీ ఏజెన్సీ (జాక్సా) నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన
విడుదల చేసింది.
అక్కడ మంచు రూపంలో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్
వాయువులను సోలార్ సెల్ ద్వారా వేరు చేసి వాటిని మళ్లీ కలపి ఇంధనాన్ని
తయారుచేయనుంది. దీంతో చంద్రుడి కక్ష్యలో ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రం నుంచి
చంద్రుడిపైకి వెళ్లే వ్యోమనౌకలకు ఉపయోగించే ఇంధనం అక్కడే లభిస్తుందని జాక్సా వెల్లడించింది.
మరి ఇది ఏ మేరకు విజయవంతమవుతుందో చూడాలి.
0 Komentar