Jobs with Industry-based training
పరిశ్రమ ఆధారిత శిక్షణతో ఉద్యోగాలు
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు
ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీసిటీలో పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని
ప్రారంబించినట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్
తెలిపారు. మొదటి బ్యాచ్ లో 30 మందికి శిక్షణ ఇస్తున్నామని,
వారందరికీ ఆల్‌స్టోమ్ లో ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు.
- 2018లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. అనంతరం ఆల్‌స్టోమ్ కంపెనీలో మరో నెలరోజులు శిక్షణ ఇచ్చి, అక్కడే ఉద్యోగం కల్పిస్తారు. ఈ నెల 21 లోపు ttp://engineering.apssdc.in/siemenPlacements/
ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 2018లో బీఎస్సీ
రసాయన శాస్త్రం పూర్తి చేసిన వారికి పరవాడ జేఎన్ ఫార్మాసిటీ(విశాఖ పట్నం)లోని
సియోంక్ ఫార్మాలో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ నెల 22 లోపు
ఆన్లైన్లో -దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- 2017-2019 లో పదో తరగతి,
ఇంటర్ పూర్తి చేసిన వారికి విశాఖపట్నంలోని వెర్ధాంట్ లైఫ్ సైన్సెస్
ప్రైవేట్ లిమిటెడ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఈ నెల 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
0 Komentar