Johnson & Johnson pauses Covid
vaccine trial as participant becomes ill
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ తాత్కాలికంగా
ట్రయల్ నిలిపివేత, ఒకరికి అస్వస్థత
కరోనా వైరస్ చికిత్స కోసం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ కీ ‘తెగులు’ సోకినట్టు ఉంది. ఇది తీసుకున్న వాలంటీర్లలో ఒకరు హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో దీని ట్రయల్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఈ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఫేజ్-3 ఎన్ సెంబల్ ట్రయల్ సహా క్లినికల్ ట్రయల్స్ అన్నింటినీ నిలిపివేస్తున్నామని ఈ సంస్థ పేర్కొంది. అంటే 60 వేల పేషంట్ల క్లినికల్ ట్రయల్ కి సంబంధించిన ఆన్ లైన్ ఎన్ రోల్ మెంట్ క్లోజ్ అయినట్టే.. అమెరికా, ఇతర ప్రపంచ దేశాల్లో 200 కి పైగా సైట్స్ లో 60 వేల మంది వాలంటీర్లను చేర్చుకోవాలన్నది జాన్సన్ అండ్ జాన్సన్ లక్ష్యం. ఈ ప్రక్రియను గత సెప్టెంబరులో ప్రారంభించింది.
0 Komentar