JoSAA: Allocation of JEE seats begins
జేఈఈ సీట్ల కేటాయింపు షురూ
ఐఐటీలు, ఎన్‌ఐటిలు,
ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో
ప్రవేశానికి సంబంధించి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2020 కౌన్సెలింగ్ లో తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తయింది. శనివారం రాత్రి..
జాయింట్ సీట్ ఆలొకేషన్ అథారిటీ (జోసా) ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు నేడు
(సోమవారం) తమ అడ్మిషన్ స్టేటస్ను నిర్ధారించాలి. ఆన్లైన్లోనే నిర్ణీత ఫీజును
చెల్లించి.. సంబంధిత ధ్రువపత్రాల స్కాన్ కాపీలను https://josaa.nic.in/ లో అప్లోడ్ చేయాలి. అలాగే మంగళవారం (20వ తేదీ) తమ
స్పందన (రెస్పాన్స్)ను ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 9 వరకు సీట్ల కేటాయింపు జోసా ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపు చేయనుంది. రెండో
విడత సీట్ల ఖాళీల వివరాలను ఈ నెల 21న ఉదయం పది గంటల నుంచి
జోసా వెబ్ సైట్‌లో పొందుపరుస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల
తర్వాత రెండో విడత సీట్ల కేటాయింపు చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22,
23 తేదీల్లో ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల
పరిశీలన చేయించుకోవాలి. 22 నుంచి 24వ
తేదీ వరకు తమకు కేటాయించిన సీటును ఉపసంహరించుకోవడం, రెండో
విడత సీటు కేటాయింపు ప్రక్రియ నుంచి వైదొలగడంపై వెబ్ సైట్లో తమ స్పందన నమోదు చేయా
లి. 26వ తేదీన మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు.
ఇలా నవంబర్ 9 వరకు ఆరు విడతల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ
కొనసాగనుంది.
0 Komentar