Key Responsibilities for ANMs - Medical
Health Dept issued the latest guidelines
ఏఎన్ఎంలకు క్షేత్రస్థాయి లో కీలక భాద్యతలు
- వైద్య ఆరోగ్యశాఖ తాజా మార్గదర్శకాలు జారీ
- ప్రతి గర్భిణిని
పరీక్షించి రక్తహీనత లేకుండా చూడాలి
- ఇక నుంచి నాలుగు సార్లు
వైద్య పరీక్షలు
- 4వ
చెకప్ విధిగా స్పెషలిస్టు దగ్గరే చేయించాలి
- వైద్య ఆరోగ్యశాఖ తాజా మార్గదర్శకాలు జారీ
ఇప్పటికీ చాలామంది గర్భిణులకు
ప్రసవాలు కష్టమవుతున్నాయి.. అందుకు రక్తహీనత ప్రధాన కారణంగా ఉంది. మాతా శిశు
మరణాలకూ రక్తహీనతే కారణమవుతోంది. ఇకపై గర్భిణులకు రక్తహీనత లేకుండా క్షేత్రస్థాయి
సిబ్బంది కృషి చేయాలని సర్కారు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. క్షేత్రస్థాయి
సిబ్బంది. గర్భిణులను ఎప్పటికప్పుడు వైద్యుల వద్ద చూపించి వారికి సురక్షిత ప్రసవం
జరిగేలా చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల వైద్యాధికారులను
ఆదేశించారు.
- ఇప్పటివరకూ గర్బిణికి 9
నెలల కాలంలో మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇకపై ఈ సంఖ్యను 4కు పెంచారు. 4వ వైద్యపరీక్ష విధిగా స్పెషలిస్ట్
డాక్టర్ దగ్గరే జరగాలని నిర్ణయించారు. వారిని విధిగా వైద్య పరీక్షలకు తీసుళ్లే
బాధ్యత ఏఎంలదే.
- ప్రతి గర్భిణికి కనీసం 11
గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే పౌష్టికాహారం లేదా
మందులు అందించాలి. - రాష్ట్రవ్యాప్తంగా 18వేల మంది ఏఎన్ఎంలు వారికి కేటాయించిన
పరిధిలో నిత్యం గర్భిణులకు, బాలింతలకు వైద్యం, చిన్నారులకు టీకాలపై అప్రమత్తంగా ఉండాలి.
-ఐసీడీఎస్ విభాగం వారితో సమన్వయం
చేసుకుంటూ గర్భిణులకు పాలు, గుడ్లు విధిగా అందేలా చేయాలి.
- అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉదయం 11
గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య గర్భిణులకు బలవర్ధక ఆహారం ఇవ్వాలి.
- ప్రతి సిజేరియన్ ప్రసవానికి
కారణాలు చూపించాలి. డాక్టర్లు వీలైనంత వరకూ సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలి.
- సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో బర్త్ వెయిటింగ్ రూములు
ఏర్పాటు చేయాలి
- తల్లీబిడ్డ క్షేమంగా.. ఆరోగ్యంగా
ఇంటిళ్లే వరకూ ఆరోగ్య శాఖ సిబ్బందే దగ్గరుండి చూసుకోవాలి.
0 Komentar