Loan moratorium: Centre informs Supreme
Court it will repay additional interest by November 5
రుణ గ్రహీతలకు కేంద్రం గుడ్
న్యూస్.. నవంబర్ 5 కల్లా అకౌంట్లలోకి డబ్బులు!
కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. లోన్ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి, సక్రమంగా ఈఎంఐ కడుతూ వచ్చిన వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.
రుణ గ్రహీతలకు బెనిఫిట్
క్యాష్‌బ్యాక్ ఆఫర్
కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. వడ్డీ మీద వడ్డీ మినహాయింపు అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మోదీ సర్కార్ రూ.2 కోట్ల వరకు రుణాలకు మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మాఫీ చేయనుంది. దీంతో ఈఎంఐ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి ఊరట కలుగనుంది.
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ ఈఎంఐ కట్టలేని వారికి ఊరట కలుగుతుండటంతో కరెక్ట్‌గా ప్రతి నెలా ఈఎంఐ కట్టే వారికి ఎలాంటి బెనిఫిట్ ఉండదా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించనుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నియంత్రణలోని కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థల కోసం ప్రత్యేక స్కీమ్‌ను నోటిఫై చేసింది. కేంద్రం వీటికి కస్టమర్ల తరుపున మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కాలానికి వడ్డీ మొత్తాన్ని వీటికి అందించనుంది.
ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కన్సూమర్ డ్యూరబుల్స్ లోన్స్, క్రెడిట్ కార్డు బకాయిలు, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్, కన్జప్షన్ రుణాలకు కేంద్ర ప్రభుత్వ పథకం వర్తిస్తుంది. నవంబర్ 5 కల్లా వడ్డీ మీద వడ్డీ మొత్తం కస్టమర్ల లోన్ అకౌంట్‌కు జమవుతుంది. రుణ గ్రహీతలందరికీ ఈ బెనిఫిట్ అందనుంది.
ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్ ఔట్ స్టాండింగ్‌పై రూ.12,425 ఆదా కానుంది. ఇక్కడ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. మారటోరియం గడువు కాలంలో ఈ రుణంపై సాధారణ వడ్డీ రూ.2 లక్షలు అవుతుంది. వడ్డీ మీద వడ్డీ కలిపితే అంటే చక్ర వడ్డీ రూ.2,12,425 అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాధారణ వడ్డీకి, చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని కస్టమర్లకు అందిస్తోంది. అంటే వీరికి రూ.12 వేలకు పైగా మిగులుతుంది. ఈ డబ్బులు రుణ గ్రహీతల లోన్ అకౌంట్‌కు వచ్చి చేరతాయి.
0 Komentar