Loan moratorium: Finance ministry issues
guidelines to implement interest waiver
రుణ గ్రహీతలకు ఆర్థిక శాఖ పండుగ
తీపికబురు.. వారికి ఊరట!
ఆర్థిక శాఖ లోన్ తీసుకున్న వారికి శుభవార్త అందించింది. లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఈఎంఐ మారటోరియం వడ్డీ మాఫీ అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.
లోన్ మారటోరియం మార్గదర్శకాలు జారీ
ఏ ఏ రుణాలకు వర్తిస్తుందంటే?
లోన్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపు అంశానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ 19 కారణంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI లోన్ మారటోరియం బెనిఫిట్ కల్పించిన విషయం తెలిసిందే.
లోన్ మారటోరియం పొందిన కస్టమర్లకు ఊరట కలుగనుంది. రూ.2 కోట్ల వరకు రుణాలు పొందిన కస్టమర్లు ఈఎంఐ మారటోరియం బెనిఫిట్ పొంది ఉంటే.. వారు ఆరు నెలల లోన్ మారటోరియం కాలానికి గారూ వడ్డీ మీద వడ్డీ చెల్లించాల్సిన పని ఉండదు. కేంద్ర ప్రభుత్వమే ఈ భారాన్ని మోస్తుంది.
కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా లోన్ మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మోదీ సర్కార్‌ను ఆదేశించింది. ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం చూస్తే.. మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం కాలానికి మాఫీ వర్తిస్తుంది. ఫిబ్రవరి చివరి నాటికి రూ.2 కోట్లకు లోపు ఉన్న రుణాలకు కేంద్రం బెనిఫిట్ వర్తిస్తుంది.
హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్
లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్
లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలకు ప్రభుత్వపు వడ్డీ మీద వడ్డీ మాఫీ
అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్
సంస్థలు వడ్డీ డబ్బులును కస్టమర్ల లోన్ అకౌంట్‌లో జమ చేస్తాయి. వడ్డీ మీద వడ్డీ
మాఫీ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు
అదనపు భారం పడనుంది.
0 Komentar