'Mano Darpan' for Students - Assurance to increase mental stamina -
SamagraSiksha SPD Instructions to Teachers, HMs
విద్యార్థులకు 'మనో
దర్పణ్' - మానసిక సైర్యం పెంచేలా భరోసా - ఉపాధ్యాయులు,
హెచ్ఎంలకు సమగ్రశిక్ష ఎస్పీడీ సూచనలు
కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం
మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థుల్లో మానసిక, శారీరక
ఇబ్బందులను తొలగించి మనోస్థైర్యాన్ని నింపేందుకు 'మనోదర్పణ్
ద్వారా వయోదశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష
రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యా
యులకు కొన్ని సూచనలు చేశారు.
- కోవిడ్ పై విద్యార్థుల్లో
భయాందోళనలను తొలగించాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు
, తుమ్ములు వచ్చినప్పుడు రుమాలు అడ్డం పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడాన్ని అనుసరించేలా చేయాలి.
- కోవిడ్ ను అధిగమించిన వయోవృద్ధుల
గురించి చెప్పి మనోసైర్యాన్ని కల్పించాలి. పిల్లల సందేహాలను నివృత్తి చేసి భరోసా
కలిగించాలి. మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడించి ఒత్తిడిని అధిగమించేలా
చేయాలి.
- పిల్లలు సామాజిక, దృశ్య
మాధ్యమాల ద్వారా స్నేహితులతో మాట్లాడడం, చిత్రకళ, పజిల్స్, బొమ్మలు తయారు చేయటం లాంటి కార్యక్రమాలు
ఇంటి నుంచే చేసేలా ప్రోత్సహించాలి. చిత్రకళ, సంగీతం, నృత్యం లాంటి కళలు నేర్చుకునే అవకాశం కలిగించాలి.
0 Komentar