Microsoft takes further steps to end
support for Internet Explorer soon
నిలిచిపోనున్న ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్
సేవలు
పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ సేవలను నిలిపివేసే దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ యూజర్స్ అందరూ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. అంతేకాకుండా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసినా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కి రీ-డైరెక్ట్ చేస్తూ సెట్టింగ్స్, డేటా, బుక్మార్క్స్, పాస్వర్డ్స్, కుకీస్ అన్నింటినీ ఎడ్జ్ లోకి మార్చుకోవాలని సూచనలు చేస్తోంది. నవంబరు 13 నుంచి ఇంటర్నెట్ ఎక్స్పోరర్ లో మైక్రోసాఫ్ట్ ఖాతాలు లాగిన్ కావడం సాధ్యం కాదని కార్పొరేట్ కస్టమర్స్ కి సమాచారం అందించింది.
అలానే 2021 ఆగస్టు 21 నుంచి ఇంటర్నెట్ ఎక్స్
ప్లోరర్ 11 వెర్షన్ లో మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్లు సపోర్ట్ చేయవని కంపెనీ ఈ
ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది నవంబరు 30 నుంచి ఇంటర్నెట్
ఎక్సప్లోరర్ 11లో మైక్రోసాఫ్ట్ వెబ్ అప్లికేషన్లు పనిచేయవని తెలిపింది. అలానే
ఎడ్జ్ లెగసీ డెస్క్ టాప్ యాప్ సేవలను వచ్చే ఏడాది మార్చి 9 నుంచి
నిలిపివేయనున్నట్లు ప్రకటించింది .
గూగుల్ క్రోమ్ కు పోటీగా ఐదేళ్ల క్రితం ఎడ్జ్ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. క్రోమ్, ఫైర్ఫాక్స్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఎడ్జ్ కు అదనపు ఫీచర్లు జోడించింది. ఇందులో బ్రౌజ్ చేసిన సమాచారాన్ని సేకరించడం, షేర్ చేయడం, ఆర్గనైజ్ చేయడంతో పాటు.. వర్డ్, ఎక్సెల్ సాయంతో ఇతరులకు పంపించుకునే సదుపాయం కల్పిస్తున్నారు. అలానే ఇన్ ప్రైవేట్ బ్రౌజింగ్ ఫీచర్ తో చిన్న పిల్లలు సురక్షితంగా బ్రౌజింగ్ చేసే వెసులుబాటు కల్పించారు.
0 Komentar