సీఏ పరీక్షలు వాయిదా
దేశవ్యాప్తంగా నవంబరు 2, 3, 6, 7 తేదీల్లో జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. బిహార్ ఎన్నికల కారణంగా వాటిని వాయిదా వేశారు. వాటిని అదే నెల 19, 21, 23, 25 తేదీల్లో జరపనున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బిసీఏఐ) తెలిపింది.
నేడు, రేపు
ఏఎన్‌యూ పీజీసెట్ పరీక్షలు - దరఖాస్తు చేయని వారికీ అవకాశం
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలలు, ఒంగోలులోని టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏఎన్‌యూ పీజీసెట్-2020 ప్రవేశ పరీక్షలు 10, 11 తేదీల్లో జరుగుతాయని యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ బి.హరిబాబు తెలిపారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో సబ్జెక్టుల వారీగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. ఏఎన్‌యూ పీజీ సెట్కు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభమయ్యే ఒక గంట ముందు వెళ్లి విద్యార్హత పత్రాలతో పాటు రూ.500 ఆలస్య రుసుము చెల్లించి నేరుగా పరీక్షకు హాజరుకావచ్చని తెలిపారు.
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీసెట్
పరీక్ష సమయం మార్పు ..!
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 11న ఎస్సీఎంవీవీ పీజీ సెట్-2020 నిర్వహిస్తున్నట్లు రెకార్ ప్రొఫెసర్ కె.సంధ్యారాణి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి నగరాల్లో ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. 11వ తేదీ ఉదయం సెషన్లో ప్రవేశ పరీక్ష రాయాల్సిన వారు. అదే సమయంలో ఇతర వర్సిటీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటే.. మధ్యాహ్నం సెషన్లో ప్రవేశ పరీక్ష రాయవచ్చునన్నారు. అలాంటి వారు ముందుగా శ్రీపద్మావతి మహిళా వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ నుంచి అనుమతి పొందాలని పేర్కొన్నారు. అనుమతి కోసం 0877-2284592 నెంబర్‌కు ఫోన్ చేయాలని (లేదా) admnspmv@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.
ఎస్వీయూ సెట్-2020 ప్రారంభం
ఎస్వీ యూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూ సెట్-2020 ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఆక్వాకల టర్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఆయా సబ్జెక్టులకు మొత్తం 1,373 మంది దరఖాస్తు చేసుకోగా 987 మంది హాజరయ్యారు. శనివారం స్టాటిస్టిక్స్,ఎలక్ట్రానిక్స్, పొలిటికల్ సైన్స్, బోటనీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
పాలి టెక్నిక్ కళాశాలల అనుమతుల
పునరుద్ధరణ
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాలి
టెక్నిక్ కళాశాలల్లో అదనపు కోర్సులు, సీట్ల పెంపు. అనుమతులను
పునరుద్ధరిస్తూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులిచ్చారు. 185 ప్రైవేటు కళాశాలలకు అనుమతులు
పునరుద్ధరణ, కొన్ని కళాశాలలకు సీట్ల పెంపు, అదనపు కోర్సులు నిర్వహణకు ఆమోదు తెలిపారు. 84 ప్రభుత్వ కళాశాలల్లో అదనపు
కోర్సులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. 33 డీఫార్మసీ కళాశాలలకు అనుమతులు పునరుద్ధరించారు.
0 Komentar