Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Morning Educational News Updates 16-10-2020

 


Morning Educational News Updates 16-10-2020


లా వర్సిటీలో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు రిజిస్టార్ ప్రొఫెసర్ మాణిక్యాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్ అసోసియేట్స్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము, ఉద్యోగార్హతలు, వేతనం, రిజర్వేషన్ నిబంధనలు తదితర వివరాల కోసం www. dsnlu.ap.in వెబ్ సైట్ లో సంప్రదించాలన్నారు.

దరఖాస్తు, డీడీలను 'రిజిస్టార్దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, సబ్బవరం, విశాఖపట్నం-530035 చిరునామాకు నవంబర్ 9వ తేదీలోగా పంపాలని కోరారు.

 

మహిళా వర్సిటీ పీజీసెట్-2020 ఫలితాలు విడుదల

శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11న నిర్వహించిన పీజీ సెట్2020 ఫలితాలను రెక్టార్ ప్రొ.సంధ్యా రాణి, రిజిస్ట్రార్ ప్రొ.మమతలతో కలిసి వీసీ దువ్వూరు జమున గురువారం విడుదల చేశారు. మొత్తం 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 95 శాతం మంది అర్హత సాధించారని వీసీ తెలిపారు. కౌన్సెలింగ్ తేదీని వచ్చే వారం వర్సిటీ వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తామని ఆడిషన్స్ సంచాలకులు సువర్ణలతాదేవి పేర్కొన్నారు.


ఇంటర్ ఆన్లైన్ తరగతుల కోసం రికార్డింగ్ థియేటర్

ఇంటర్ విద్యార్థుల ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ రికార్డింగ్ థియేటర్‌ను గురువారం ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రారంభించారు. ఈ థియేటర్లో ఆన్లైన్ తరగతుల రికార్డింగ్, ఎడిటింగ్ చేయనున్నారు.

 

తపాలా ద్వారానే దరఖాస్తుల స్వీకరణ

మైగ్రేషన్, ఉత్తీర్ణత ద్రువపత్రం నకలు, టీటీసీ లోయర్ నుంచి హయ్యరకు మార్పు, ఇతర ద్రువపత్రాల్లో తప్పుల సవరణకు ఎవరూ కార్యాలయానికి రావొద్దని, దరఖాస్తులను తపాలా ద్వారా పంపించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. తపాలా ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తామని, నిర్ణీత గడువు లోపు తపాలా ద్వారా అభ్యర్దుల చిరునామాకు వాటిని పంపిస్తామని వెల్లడించారు. స్పీడ్ పోస్ట్, ఆర్డినరీ పోస్టు సదుపాయాన్ని అభ్యర్థులే నిర్ణయించుకోవాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags