NEET Counselling 2020: Counselling registration
to begin tomorrow
రేపటి నుంచి నీట్ కౌన్సెలింగ్..
ఆలిండియా మెడికల్ కోటాతో మొదలు..!
NEET UG COUNSELLING 2020: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ఈనెల 27 నుంచి మొదలుకానుంది.
అఖిల భారత వైద్యవిద్య కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ఈనెల 27 నుంచి మొదలుకానుంది. అక్టోబర్ 27 నుంచి నవంబరు 2 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 5న సీట్లు కేటాయిస్తారు. సీటు పొందినవారు నవంబరు 6 నుంచి కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 15 శాతం సీట్లను అఖిల భారత కోటాలో జమ చేస్తున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలు http://mcc.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
రాష్ట్రం నుంచి సుమారు 230 సీట్లను ఈ కోటాలోకి ఇస్తుండగా.. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 6,410 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి నుంచి కొత్తగా ఎయిమ్స్ కాలేజీలు, జిప్‌మర్ వైద్యసంస్థల్లోనూ సీట్లను నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే భర్తీ చేస్తుండడంతో.. అభ్యర్థులు తాము ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాధాన్య క్రమంలో వాటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నది నిపుణుల సూచన.
ఫస్ట్ రౌండ్:
మొదటి రౌండ్ కౌన్సిలింగ్
రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27న మొదలవుతుంది.
నవంబర్ 2
సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు నవంబర్ 2
రాత్రి 7 గంటల వరకు చెల్లించవచ్చు.
మొదటి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 2 సాయంత్రం 4 గంటల
నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్
నవంబర్ 3,
4 తేదీల్లో పూర్తవుతుంది.
ఫలితాలు నవంబర్ 5న
విడుదలవుతాయి.
2020 నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ రౌండ్:
రెండో రౌండ్ కౌన్సిలింగ్‌కు
రిజిస్ట్రేషన్ 2020 నవంబర్ 18న మొదలవుతుంది.
నవంబర్ 22
మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు నవంబర్ 22
సాయంత్రం 5 గంటల వరకు చెల్లించవచ్చు.
రెండో రౌండ్ చాయిస్ ఫిల్లింగ్
నవంబర్ 19 నుంచి నవంబర్ 22 రాత్రి 11.59
గంటల వరకు ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల
నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
రెండో రౌండ్ సీట్ అలాట్‌మెంట్
నవంబర్ 23,
24 తేదీల్లో పూర్తవుతుంది.
ఫలితాలు నవంబర్ 25న
విడుదలవుతాయి.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మాప్ అప్ రౌండ్:
మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్‌కు
రిజిస్ట్రేషన్ 2020 డిసెంబర్ 10న మొదలవుతుంది.
డిసెంబర్ 14
మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పేమెంట్ సదుపాయం డిసెంబర్ 14
సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
మాప్ అప్ రౌండ్ చాయిస్ ఫిల్లింగ్
డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్ 2020 డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల
నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
మాప్ అప్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్
డిసెంబర్ 15, 16 తేదీల్లో పూర్తవుతుంది.
ఫలితాలు డిసెంబర్ 17న
విడుదలవుతాయి.
డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Stray Vacancy రౌండ్:
నాన్ రిపోర్టింగ్, నాన్
జాయినింగ్ ఖాళీ సీట్లను డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ,
ఈఎస్ఐసీకి బదిలీ చేస్తారు. 2020 డిసెంబర్ 28 నుంచి 31 వరకు స్ట్రే వెకెన్సీ రౌండ్ ఉంటుంది.
0 Komentar