NEET counselling 2020 schedule released
నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..!
నీట్ 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేసింది. ఈ కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. అలాగే జిప్‌మర్, ఎయిమ్స్, సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే సీట్లన్నీ కూడా ఇందులోకే వస్తాయి. అభ్యర్థులు పూర్తి వివరాలు http://mcc.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఫస్ట్ రౌండ్:
మొదటి రౌండ్ కౌన్సిలింగ్
రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27న మొదలవుతుంది.
నవంబర్ 2
సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు నవంబర్ 2
రాత్రి 7 గంటల వరకు చెల్లించవచ్చు.
మొదటి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 2 సాయంత్రం 4 గంటల
నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్
నవంబర్ 3,
4 తేదీల్లో పూర్తవుతుంది.
ఫలితాలు నవంబర్ 5న
విడుదలవుతాయి.
2020 నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ రౌండ్:
రెండో రౌండ్ కౌన్సిలింగ్‌కు
రిజిస్ట్రేషన్ 2020 నవంబర్ 18న మొదలవుతుంది.
నవంబర్ 22
మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు నవంబర్ 22
సాయంత్రం 5 గంటల వరకు చెల్లించవచ్చు.
రెండో రౌండ్ చాయిస్ ఫిల్లింగ్
నవంబర్ 19 నుంచి నవంబర్ 22 రాత్రి 11.59
గంటల వరకు ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల
నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
రెండో రౌండ్ సీట్ అలాట్‌మెంట్
నవంబర్ 23,
24 తేదీల్లో పూర్తవుతుంది.
ఫలితాలు నవంబర్ 25న
విడుదలవుతాయి.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మాప్ అప్ రౌండ్:
మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్‌కు
రిజిస్ట్రేషన్ 2020 డిసెంబర్ 10న మొదలవుతుంది.
డిసెంబర్ 14
మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పేమెంట్ సదుపాయం డిసెంబర్ 14
సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
మాప్ అప్ రౌండ్ చాయిస్ ఫిల్లింగ్
డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్ 2020 డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల
నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
మాప్ అప్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్
డిసెంబర్ 15, 16 తేదీల్లో పూర్తవుతుంది.
ఫలితాలు డిసెంబర్ 17న
విడుదలవుతాయి.
డిసెంబర్ 18
నుంచి డిసెంబర్ 24 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Stray Vacancy రౌండ్:
నాన్ రిపోర్టింగ్, నాన్
జాయినింగ్ ఖాళీ సీట్లను డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ,
ఈఎస్ఐసీకి బదిలీ చేస్తారు. 2020 డిసెంబర్ 28 నుంచి 31 వరకు స్ట్రే వెకెన్సీ రౌండ్ ఉంటుంది.
షెడ్యూల్:
0 Komentar