Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New rules from October 1 - Here are 10 things to change


New rules from October 1 - Here are 10 things to change
అక్టోబర్ 1 నుండి కొత్త నియమాలు.. మారే 10 అంశాలివే.. మీపై ఎఫెక్ట్!
అక్టోబర్ నెల వచ్చింది. కొత్త నెలతోపాటు కొత్త రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. దీంతో ప్రజలపై నేరుగా ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల ఈరోజు నుంచి ఏ ఏ అంశాలు మారుతున్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.
  
ఈరోజు నుంచి కొత్త రూల్స్
కొందరికి ప్రయోజనం
మరికొందరిపై ప్రభావం

కొత్త నెల వచ్చేసింది. అక్టోబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెలతో పాటుగా కొత్త రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. దీంతో చాలా మందిపై నేరుగానే ప్రభావం పడుతుంది. అందువల్ల అక్టోబర్ 1 నుంచి మారే అంశాలు ఏంటివో ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. మనీ ట్రాన్స్‌ఫర్, ఇన్సూరెన్స్ దగ్గరి నుంచి టీవీ కొనుగోలు వరకు చాలా అంశాలు మారాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

1. వాహనదారులకు శుభవార్త అందింది. లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్స్ వంటి పలు కీలక డాక్యుమెంట్లను జేబులో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. వీటిని ప్రభుత్వ వెబ్‌ పోర్టల్‌లో పెట్టుకొని వాటిని అధికారులకు చూపిస్తే సరిపోతుంది.

2. అంతేకాకుండా డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్ ఉపయోగించొచ్చు. అయితే ఇది అన్నింటికీ మాత్రం కాదు. రూట్ నావిగేషన్ కోసం మాత్రమే ఫోన్‌ను ఉపయోగించొచ్చు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే మీరు ఫోన్‌లో మాట్లాడుతూ అధికారులకు చిక్కితే రూ.5 వేల వరకు జరిమానా పడుతుంది.

3. ఉజ్వల స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ఉచితంగానే గ్యాస్ సిలిండర్లను అందించింది. అయితే ఇకపై ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. ఉచితంగా సిలిండర్ రాదు. 

4. ఇకపోతే ఈరోజు నుంచి కొత్త ట్యాక్స్ రూల్ అమలులోకి వచ్చింది. దీంతో మీరు ఇకపై విదేశాలకు డబ్బులు పంపితే ట్యాక్స్ పడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు పైన డబ్బులు పంపితేనే ఇది వర్తిస్తుంది. 5 శాతం టీసీఎస్ పడుతుంది. విద్యార్థులకు పన్నులో రాయితీ లభిస్తుంది.

5. మీరు స్వీట్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ఇకపై స్వీట్ షాపుల్లో స్వీట్స్ ఎక్స్‌పైరీ డేట్ కచ్చితంగా తెలియజేయాలి. అంతేకాకుండా దాన్ని ఎవరు తయారు చేశారు.. ఎప్పటిలోగా ఉపయోగిస్తే బాగుంటుంది వంటి వివరాలు కూడా కస్టమర్లకు అందించాలి.

6. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మార్పులు వచ్చాయి. ఐఆర్‌డీఏఐ ఈ రోజు నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే తీసుకున్న, కొత్త పాలసీలు అన్ని దాదాపు చాలా వరకు వ్యాధులకు వర్తిస్తాయి.

7. ఒకపోతే పండుగ సీజన్‌లో టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఝలక్. ఈరోజు నుంచి టీవీల ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీ మినహాయింపును తొలగించింది. దీంతో ఓపెన్ సెల్స్‌పై 5 శాతం పన్ను మళ్లీ పడుతుంది.

8. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రూల్స్ కూడా మారాయి. అక్టోబర్ 1 నుంచి ఇకపై కొన్ని కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో ఉండవు. ప్రత్యేకించి అంతర్జాతీయ లావాదేవీలకు బంద్ కావొచ్చు.

9. ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి కొత్త రూల్ తీసుకువచ్చింది. ఆవాల నూనెను మరే ఇతర నూనెలతో కలపవద్దని రూల్స్ జారీ చేసింది.

10. ఆదాయపు పన్ను శాఖ కొత్త రూల్ తెచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈకామర్స్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అంటే ఈ కంపెనీలు అవి విక్రయించే ప్రొడక్టులపై 1 శాతం టీసీఎస్‌ను వసూలు చేస్తాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags