New Rules into effect for credit and
debit card users .... 10 things to know!
క్రెడిట్ కార్డ్, డెబిట్
కార్డ్ వాడే వారు తెలుసుకోవాల్సిన 10 అంశాలివే!
మీకు క్రెడిట్ కార్డు ఉందా? లేదంటే
బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు
కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రిజర్వు బ్యాంక్ అక్టోబర్ 1 నుంచి ఈ కార్డులకు సంబంధించిన రూల్స్‌ను మార్చేసింది.
క్రెడిట్ కార్డు, డెబిట్
కార్డుల ద్వారా డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇవి
అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల నేపథ్యంలో
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉపయోగించే వారు కొన్ని
విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
1. కార్డులు లేదా పాత
కార్డు స్థానంలో మళ్లీ కొత్త కార్డులు తీసుకుంటే అవి కేవలం ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లలోనే పని చేస్తాయి. అది కూడా భారత్‌లో
మాత్రమే.
2. కస్టమర్లు వారి డెబిట్
కార్డు లేదా క్రెడిట్ కార్డును దేశం వెలుపల విదేశాల్లో ఉయోగించాలని భావిస్తే..
వారు బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి.
3. ఇప్పటికే ఉపయోగిస్తున్న
కార్డుల విషయానికి వస్తే.. వాటిపై ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఇవ్వొచ్చనే అధికారం
బ్యాంకులకు ఉంటుంది.
4. ఆన్‌లైన్ లేదా కాంటాక్ట్‌లెస్
ట్రాన్సాక్షన్లు నిర్వహించని కార్డులపై ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసులను నిలిపివేయాలని
ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.
5. కార్డు వినియోగదారులు
వారి కార్డులపై స్పెండ్ లిమిట్, ఆన్‌లైన్, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లు, కాంటాక్ట్‌లెస్
ట్రాన్సాక్షన్లకు సంబంధించిన సేవల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
6. కార్డును స్విచాఫ్ లేదా
స్విచాన్ చేసుకునే ఫెసిలిటీ కస్టమర్లకు 24 గంటలూ అందుబాటులో
ఉంటుంది. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, ఐవీఆర్ మార్గాల్లో ఈ వెసులుబాటు అందుబాటులో
ఉండాలి. అలాగే ఈ మార్గాల్లోనే ట్రాన్సా్క్షన్ లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు.
7. చాలా బ్యాంకులు ఎన్ఎఫ్‌సీ
NFC టెక్నాలజీతో కార్డులను జారీ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు
బ్యాంక్ కస్టమర్లు ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవడం లేదా ఆన్ చేసుకోవడం అనే సదుపాయం కూడా
పొందనున్నారు.
8. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ట్రాన్సాక్షన్ లిమిట్‌ను సెట్
చేసుకోవడానికి కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది.
9. ఆర్‌బీఐ కొత్త రూల్స్
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తిస్తాయి.
ప్రిపెయిడ్ గిఫ్ట్ కార్డ్, మెట్రో కార్డ్ వంటి వాటికి ఈ
రూల్స్ వర్తించవు.
10. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్
సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10(2) కింద ఈ కొత్త నిబంధనలను జారీ చేశారు. సైబర్ మోసాలు పెరిగిపోతున్న
నేపథ్యంలో ఈ కొత్త రూల్స్ వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది.
0 Komentar