Nobel Peace Prize 2020 Awarded To 'World Food Programme'
ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి
నోబెల్ శాంతి బహుమతి ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారానికి ఈసారి ‘ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం’ను ఎంపిక చేశారు.
ప్రపంచంలో అత్యంత
ప్రతిష్టాత్మకమైనవిగా భావించే నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతికి మరింత
ప్రాముఖ్యం ఉంది. ఈ ఏడాది ఈ బహుమతి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 2020కి గాను ‘ప్రపంచ ఆహార కార్యక్రమానికి’ (World Food Programme) నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన UNWFP
సంక్షోభిత ప్రాంతాల్లో చేసిన సేవలకు గాను ఈ ప్రతిష్టాత్మక
పురస్కారాన్ని ప్రకటించినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ శుక్రవారం (అక్టోబర్ 9)
తెలిపింది. ఆకలి తీర్చడం, జీవన స్థితిగతులను
మెరుగుపరిచినందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు పేర్కొంది. కరోనా
సంక్షోభం మరింత మందిని పేదరికంలోకి నెట్టేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం
తీసుకున్నట్లు వివరించింది.
0 Komentar