Two Nobel Prizes in Chemistry for
Research in Genome Editing
జీనోమ్ ఎడిటింగ్‌లో పరిశోధనలకు
కెమిస్ట్రీలో ఇద్దరికి నోబెల్
Genome Editing: రసాయనశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంపై పరిశోధనలకు గాను ఇమాన్యుయేల్ చార్పెంటర్, జెన్నీఫర్ ఎ డౌండాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
రసాయనశాస్త్రంలో నోబెల్
పురస్కారాలను ప్రకటించారు. ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్, జెన్నీఫర్
ఎ డౌండ్నాకు 2020 సంవత్సరానికి గాను సంయుక్తంగా ఈ
ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంలో పరిశోధనలకు గాను
వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం
(అక్టోబర్ 7) ప్రకటించింది. ఇమ్మాన్యూయెల్ ఫ్రాన్స్‌లోని
జువిసీ సర్ ఓర్జ్‌లో 1968లో జన్మించారు. బెర్లిన్‌లోని
మ్యాక్స్ ప్లాంక్ యూనిట్‌లో ఆమె డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. జెన్నీఫర్
అమెరికాలోని వాషింగ్టన్‌లో 1964లో జన్మించారు. యూసీ బెర్క్‌లీలో
ఆమె ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
0 Komentar