Notification for UPSC Jobs
యూపీఎస్సీ 44
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా
ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా
ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)
నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్ ద్వారా ఫోర్‌మెన్,
స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇతర పోస్టులను భర్తీచేయనుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక
చేస్తారు. అక్టోబర్ 29 దరఖాస్తులకు చివరితేది. పూర్తి
వివరాలకు http://upsc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 44
(కేంద్ర రక్షణ శాఖలోని
ఫోర్‌మెన్-5 పోస్టులు, సీనియర్
సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్)-5, సీనియర్
సైంటిఫిక్ అసిస్టెంట్ (మెటలర్జీ)-1, స్పెషల్ గ్రేడ్
అసిస్టెంట్ ప్రొఫెసర్-33 పోస్టులు ఉన్నాయి)
అర్హతలు: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టులకు 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 30 ఏళ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్
29,
2020
హార్డ్‌కాపీలు పంపడానికి
చివరితేదీ: అక్టోబర్ 30
వెబ్‌సైట్: http://upsc.gov.in/
0 Komentar