Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

November 2020 Bank Holidays

 


November 2020 Bank Holidays

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే?

మీకు నవంబర్‌లో ముఖ్యమైన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నాయా? నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉంటాయి. ఎప్పుడో తెలుసుకోండి.

దసరా పండుగ అయిపోయింది. ఇక దీపావళి సీజన్ మొదలైంది. అక్టోబర్ నెల ముగుస్తోంది. నవంబర్ రాబోతోంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువగా పండుగలు ఉంటాయి. అందుకే ఈ పండుగ సీజన్‌ను వ్యాపారవర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ సమయంలో ఎక్కువగా లావాదేవీలు జరుగుతుంటాయి. బ్యాంకులు కూడా బిజీబిజీగా ఉంటాయి. నవంబర్‌లో దీపావళితో పాటు ఇతర పర్వదినాలు ఉండటంతో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉండనున్నాయి. ఇక దీంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులకు సెలవులే. రెండు శనివారాలు, ఐదు ఆదివారాలతో పాటు పండుగల సందర్భంగా సెలవులు ఉంటాయి. మరి మీకు బ్యాంకుల్లో ముఖ్యమైన లావాదేవీలు ఏవైనా ఉంటే ఏఏ రోజులు సెలవులు ఉన్నాయో, బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయో తెలుసుకొని వెళ్లడం మంచిది. మరి నవంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

నవంబర్ 1- ఆదివారం

నవంబర్ 8- ఆదివారం

నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి పండుగ

నవంబర్ 15- ఆదివారం

నవంబర్ 22- ఆదివారం

నవంబర్ 28- నాలుగో శనివారం

నవంబర్ 29- ఆదివారం

నవంబర్ 30- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

పైన వెల్లడించినవి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు. మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండో శనివారం రోజే దీపావళి పండుగ ఉండటంతో ఒక సెలవు తగ్గింది. స్థానిక పండుగలు, పర్వదినాలను బట్టి ఈ సెలవుల్లో మార్పులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 16న భాయ్ దూజ్, నవంబర్ 17న నింగోల్ చకౌబా, నవంబర్ 24న లచ్చిత్ దివస్, నవంబర్ 16న సెంగ్ కుట్ స్నెమ్ లాంటి వేడుకల సందర్భంగా సెలవులున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయన్న సంగతి కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఏడాదంతా బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/ లో తెలుసుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags