రూపాయి నాణెంతో పాతిక లక్షలు మీ
సొంతం!
ఇండియామార్ట్‌పై అరుదైన నాణేల వేలం
మీ వద్ద ఒక రూపాయి నాణెం ఉంటే మీరు
ఎంచక్కా పాతిక లక్షలు సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ రూపాయి నాణెం కనీసం వందేళ్ల
కిందటిది అయి ఉండాలి. పురాతన నాణేలను దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్ సంస్థ
ఇండియామార్ట్ వేలం వేస్తుంటుంది. మీ వద్ద అలాంటి పురాతన, అపురూప
నాణెం ఉంటే మీరు దాన్ని వేలంలో ఉంచి లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగిఉంటే దాన్ని మీరు రూ 25
లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను
ఇండియామార్ట్‌పై రూ 25 లక్షలుగా నిర్ణయించారు.
18వ శతాబ్ధం నాటి నాణెం
ధరను రూ 10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో
ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్‌పై రూ 10లక్షలుగా ఖరారు చేశారు. ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫోటో ముద్రితమై
ఉంటుంది. మీరు అరుదైన, పురాతన నాణేలను విక్రయించదలిస్తే మీరు
ఇండియామార్ట్ వెబ్‌సైట్ ఇండియామార్ట్.కాంను సంపద్రించవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై మీరు
మీ ఖాతాను తెరిచి, వెబ్‌సైట్‌లో విక్రేతగా మీ పేరు నమోదు
చేసుకోవాలి. రిజిస్ర్టేషన్ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్‌లోడ్ చేసి వాటిని
సేల్‌లో ఉంచవచ్చు. పురాతన నాణేల సేకరణ పట్ల ఉత్సాహం చూపే వారు ఇలాంటి అవకాశాల కోసం
చూస్తుంటారు. ఈ అరుదైన నాణేలను సొంతం చేసుకునేందుకు వారు పెద్దమొత్తం
చెల్లించేందుకు వెనుకాడరు.
0 Komentar