Online Evaluation of Group-1 Answer
Papers
ఆన్‌లైన్‌లో గ్రూపు-1
జవాబుపత్రాల మూల్యాంకనం
డిసెంబరులోనే ప్రధాన పరీక్షలు?
త్వరలో జరగనున్న గ్రూపు-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. అక్టోబరు 28న జరిగిన కమిషన్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుత విధానంలో జవాబుపత్రం(బుక్‌లెట్)లోని ఒక్కొక్క ప్రశ్న జవాబును ఒక్కో ప్రొఫెసర్ మూల్యాంకనం చేస్తున్నారు. మార్కులను పక్కనే జవాబు పత్రాలపై వేస్తున్నారు. ఇకపై జవాబులను ఆన్‌లైన్ (డిజిటల్)ద్వారా మూల్యాంకనం చేయనున్నారు. జవాబు పత్రాలను స్కానింగ్ చేసి, ఎంపికచేసిన ప్రొఫెసర్లకు కంప్యూటర్ ద్వారా పంపుతారు. వారు మూల్యాంకనం చేసి, మార్కులను ఆన్‌లైన్‌లోనే నమోదుచేస్తారు. పరీక్షా కేంద్రాల్లో అందజేసే ‘ట్యాబ్’ల ద్వారా వచ్చే ప్రశ్నలు చూసి, అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ఇలా చేయడం ఇదే ప్రథమం.
వారంలో జాబితా వెల్లడి!
గ్రూపు-1
ప్రధాన పరీక్షలను డిసెంబరులోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. అక్టోబరు 29న తేదీలు ప్రకటిస్తారు. నవంబరు 2 నుంచి జరగాల్సిన
ఈ పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ వాయిదావేసింది. ప్రిలిమినరీ
ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లాయని.. పునర్‌ముల్యాంకనం చేయాలంటూ కొందరు హైకోర్టును
ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయా ప్రశ్నలను సవరించి జవాబులను మరోసారి
మూల్యాంకనం చేస్తారు. ఈ జాబితాను వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబరు 16 నుంచి పరీక్షలు ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
దీనివల్ల జనవరి 8 నుంచి జరగనున్న సివిల్స్ ప్రధాన పరీక్షలకు
సన్నద్ధమయ్యే వారికి కూడా సమయం సరిపోతుందని కమిషన్ సమావేశంలో చర్చించారు.
0 Komentar