Over 93,500 Data Science Jobs Vacant in
India: Study
డేటా సైన్స్ విభాగంలో 93,500 ఉద్యోగ ఖాళీలు
భారతదేశంలో డేటా సైన్స్ నిపుణుల సగటు జీతం 2020 లో ఏడాదికి రూ .9.5 లక్షలు అని ఈ అధ్యయనం వెల్లడించింది.
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది. ఈ తరుణంలో జాబ్ మార్కెట్‌లో ముందుండాలంటే పరిస్థితులను గమనిస్తూ.. అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే నెగ్గుకు రాగలం. ఈ క్రమంలో జాబ్ మార్కెట్‌ను అంచనా వేసే ఓ అధ్యయన సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
అదేమిటంటే.. ఆగస్టు చివరి నాటికి దేశంలో అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగంలో 93,500 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని ప్రకటించింది. వీటిని భర్తీ చేస్తే ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన కోర్సులు నేర్చుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు రానున్నాయి.
యాక్సెంచర్, ఎంఫసిస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐబీఎం ఇండియా, డెల్, హెచ్ సీఎల్ తదితర ప్రముఖ కంపెనీల్లో డేటా సైన్స్ విభాగంలో అత్యధిక ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో డేటా సైన్స్ నిపుణుల సగటు జీతం 2020 లో ఏడాదికి రూ .9.5 లక్షలు అని ఈ అధ్యయనం వెల్లడించింది.
పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. వారి నైపుణ్యం, రోల్ ఆధారంగా ఏడాదికి రూ .25 లక్షల నుంచి రూ .50 లక్షల ప్యాకేజీలను ఆయా కంపెనీలు అందించే అవకాశం ఉంది. సో.. డేటా సైన్స్ విభాగంలో పట్టు సాధించిన వాళ్లకు ఉద్యోగాలకు కొదవ ఉండదు.
ఇక డేటా అనలిటిక్స్ రంగంలో ఖాళీల సంఖ్య స్వల్పంగా తగ్గుతోంది. కాకపోతే డిమాండ్ మాత్రం స్థిరంగా ఉంటోంది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే బెంగళూరులో అనలిటిక్స్ విభాగంలో అత్యధిక ఉద్యోగాలు ఉన్నాయి. దేశం మొత్తంతో పోల్చితే.. ఈ ఒక్క నగరంలో 23 శాతం ఉద్యోగాలు ఆ రంగానికి సంబంధించినవి ఉన్నాయి.
ఢిల్లీలో 20
శాతం కాగా, ముంబై మరో 15 శాతం
ఉద్యోగాలను ఈ రంగంలో అందిస్తోంది. హైదరాబాద్, పూణే, చెన్నై వంటి ఇతర ప్రసిద్ధ మెట్రో నగరాలు గత సంవత్సరంతో పోలిస్తే ఆగస్టులో
ఉద్యోగాల నిష్పత్తిలో స్వల్ప వృద్ధిని సాధించాయి. దేశంలో కోవిడ్ సంక్షోభం
ఉన్నప్పటికీ.. ఆగస్టులో ప్రపంచంలోని అనలిటిక్స్ జాబ్ ఓపెనింగ్స్‌లో భారత్ వాటా 9.8 శాతం. ఇది 2020 జనవరిలో 7.2
శాతంగా ఉంది.
0 Komentar