Paul R Milgrom and Robert B Wilson win
2020 Nobel Prize in Economics
వేలం సిద్ధాంతానికి పట్టం.. ఆర్థిక
శాస్త్రంలో ఇద్దరికి నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఇద్దరిని ఎంపిక చేశారు. వేలం సిద్ధాంతాల ఆవిష్కరణకు గాను పాల్ ఆర్ మిల్‌గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌ను సంయుక్తంగా నోబెల్ వరించింది.
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇద్దరిని వరించింది. ఈ ఏడాది గాను Economics లో నోబెల్ బహుమతి (Nobel Prize)ను పౌల్ ఆర్ మిల్‌గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌కు సంయుక్తంగా ప్రకటించారు. వేలం ప్రక్రియకు సంబంధించి ఈ ఇరువురు నిపుణులు కొత్త విధానాలను ఆవిష్కరించారు. వేలం సిద్ధాంతాల ఆవిష్కరణ, అభివృద్ధికి గాను వీరిద్దరికీ 2020 సంవత్సరానికి నోబెల్ పురస్కారం ప్రకటించినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ సోమవారం (అక్టోబర్ 12)) పేర్కొంది.
వేలం వేయడం అంతటా ఉంది. అది మన
రోజువారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. పౌల్ మిల్‌గ్రామ్, రాబర్ట్
విల్సన్ కనుగొన్న కొత్త వేలం విధానాలతో అటు అమ్మకందారులకు, ఇటు కొనుగోలుదారులకే కాకుండా పన్నుదారులకు కూడా లాభం కలుగుతుంది.
నోబెల్ కమిటీ
రేషనల్ బిడ్డర్ల గురించి విల్సన్, బిడ్డింగ్‌లో పాల్గొన్నవారిలో ఉండే వ్యత్యాసాల గురించి పౌల్ మిల్‌గ్రామ్ కొత్త ఫార్మాట్లను రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద వీరిద్దరూ 1.1 మిలియన్ డాలర్ల నగదు, గోల్డ్ మెడల్‌ను దక్కించుకోనున్నారు.
‘వేలం వేయడం అనేది అంతటా ఉంది. అది మన రోజువారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. పౌల్ మిల్‌గ్రామ్, రాబర్ట్ విల్సన్ కనుగొన్న కొత్త వేలం విధానాల వల్ల అటు అమ్మకందారులకు, ఇటు కొనుగోలుదారులకే కాకుండా పన్నుదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది’ అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.
గత ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రవాస భారతీయులు అభిజిత్ బెనర్జీ, ఈస్తర్ డుఫ్లో దంపతులకు దక్కిన విషయం తెలిసిందే. నోబెల్ వరించిన అయిదో జంటగా వారు రికార్డుల్లో నిలిచారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులైన వీరు హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన మరో పరిశోధకుడితో కలిసి ప్రపంచంలో పేదరికాన్ని తగ్గించడానికి గల అవకాశాలపై పరిశోధన చేశారు. కీలక సూచనలు చేశారు.
0 Komentar