Payment of 3 pending DAs - Payment of pending
salaries from November
పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ ల
చెల్లింపు - నవంబర్ నుంచే వాయిదా పడ్డ జీతాల చెల్లింపు
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
1. 2018 జులై నాటి నుండి చెల్లించాల్సిన(3.144%) కరువు భత్యాన్ని 2021 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం. అది కూడా మూడు వాయిదా లలో చెల్లించాలని నిర్ణయం.
2. పెండింగ్ లో ఉన్న రెండో కరువు భత్యం(4.716%) 2021 జులై జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
3. పెండింగ్లో ఉన్న మూడో కరువు భత్యాన్ని(7.860%) 2022 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
అలాగే కరోనా కారణంగా వాయిదా వేసిన
మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను ఐదు
విడతల్లో చెల్లిస్తారు. మొదటి విడత ఈ
నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు.
0 Komentar