PJTSAU: Engineering Candidates - Farmers' Quota Admissions
ఇంజనీరింగ్
అభ్యర్థులకు అలర్ట్.. రైతుల కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ వ్యవసాయ వర్సిటీ 2020-21 సంవత్సరానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. 2020-21 సంవత్సరానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణ స్టేట్ ఎంసెట్-2020 ర్యాంకు ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 30 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలను https://pjtsau.edu.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఫార్మర్స్ కోటా బీటెక్ ప్రవేశాలు:
1) బీటెక్ అగ్రికల్చరల్
ఇంజినీరింగ్ (18 సీట్లు)
2) బీటెక్ ఫుడ్ టెక్నాలజీ
(18 సీట్లు)
అర్హత: మ్యాథమేటిక్స్, ఫిజికల్
సైన్సెస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కనీసం నాలుగేళ్లు గ్రామీణ
ప్రాంతాల్లో చదివి ఉండాలి. కనీసం ఒక ఎకరా భూమి కలిగి ఉండాలి.
వయసు: 31.12.2020 నాటికి 17-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: తెలంగాణ స్టేట్ ఎంసెట్-2020 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేది: అక్టోబర్ 30, 2020
వెబ్‌సైట్: https://pjtsau.edu.in/
0 Komentar