Pradhan Mantri Matri Vandana Yojana
(PMMVY)
ఈ స్కీమ్‌లో చేరితే మహిళల బ్యాంక్
అకౌంట్లలోకి రూ.6,000.. వారికే వర్తింపు!
కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక
స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరిన వారికి రూ.6,000 లభిస్తాయి. అయితే ఇది
అందరికీ అందుబాటులో లేదు. కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది.
కేంద్రం నుంచి మహిళలకు స్కీమ్
బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.6,000
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల
స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన PMMVY కూడా ఒకటి. ఈ పథకం కేవలం గర్భిణి స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్‌కు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ డబ్బులు నేరుగా మహిళల బ్యాంక్ అకౌంట్లలోనే
జమవుతుంది.
తల్లి, బిడ్డ
ఆరోగ్య భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. తొలి
బిడ్డకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు రూ.6,000 లభిస్తాయి. ప్రధాన్ మంత్రి మాతృ వందన పథకం కింద వచ్చే రూ.6,000 మూడు విడతల్లో అందిస్తారు. అంగన్‌వాడీ సెంటర్ లేదా ఆశా వర్కర్ వద్దకు వెళ్లి
ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
ప్రెగ్జెన్సీ వచ్చిన మహిళలు స్కీమ్‌లో
చేరిన వెంటనే తొలి విడత కింద రూ.1,000 వస్తాయి. రెండో విడత కింద రూ.2,000 డబ్బులు వస్తాయి. ప్రెగ్జెన్సీ వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ డబ్బులు
పొందొచ్చు. ఇక చివరి విడత రూ.2,000 డబ్బులు బిడ్డ పుట్టిన
తర్వాత వస్తాయి. ఇక్కడ బిడ్డకు బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించి
ఉండాలి. ఆ తర్వాతనే ఈ డబ్బులు వస్తాయి.
ఈ రూ.5,000 కాకుండా జనని సురక్ష యోజన కింద డెలివరీ అయిన వెంటనే మహిళకు రూ.1,000 అందిస్తారు. హాస్పిటల్‌లోనే ఈ డబ్బులు పొందొచ్చు. ఈ విధంగా మహిళలు కేంద్ర
ప్రభుత్వం నుంచి రూ.6,000 ఆర్థిక సాయం పొందొచ్చు. మీ
కుటుంబంలో కూడా ఎవరైనా ప్రెగ్నెంట్స్ ఉంటే ఈ విషయాన్ని వారికి తెలియజేసి స్కీమ్‌లో
చేరేలా చూడండి.
0 Komentar