Over 2.4 crore people apply for 1.4 lakh
job vacancies at the Indian Railways
షాకింగ్: రైల్వే జాబ్స్ ఉన్నవి 1.4 లక్షలు.. దరఖాస్తు చేసుకున్న వాళ్లు 2.4 కోట్లు..!
రైల్వే పోస్టులకు డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ ఆధారిత టెస్టులు నిర్వహించేందుకు ఆర్‌ఆర్‌బీ సిద్ధమవుతోంది.
మనదేశంలో రైల్వే ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో జాబ్స్ పడితే.. వేలు, లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. అందులోనూ ప్రస్తుతం నడుస్తున్నది కరోనా ట్రెండ్.. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతోంది. ఈ క్రమంలో రైల్వే నోటిఫికేషన్లు పడితే ఎంత కాంపిటీషన్ ఉంటుందో.. తాజాగా రైల్వే శాఖ చెప్పిన లెక్క చూస్తే అర్థమవుతోంది. వివరాల్లోకెళ్తే..
ప్రస్తుతం ఇండియన్ రైల్వే విభాగంలో వేర్వేరు కేటగిరీల్లో 1.4 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టులు దక్కించుకునేందుకు 2.4 కోట్ల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంటే అటు అభ్యర్థులను ఎంపిక చేయడం అనే ప్రక్రియ ఆర్‌ఆర్‌బీకి.. ఇటు పోటీలో నిలబడి పోస్టులను చేజెక్కించుకోవడం అభ్యర్థులకీ.. ఇద్దరికీ పెద్ద సవాలే.
రైల్వే శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. దాని సారాంశం ఏమిటంటే.. మూడు రకాల కేంద్ర ఉద్యోగాలలో భాగంగా.. NTPC కేటగిరీలు, మంత్రిత్వ శాఖల కేటగిరీలు, లెవెల్-1 కేటగిరీల్లో ఖాళీల భర్తీ కోసం ఆర్‌ఆర్‌బీ మూడు రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మూడు నోటిఫికేషన్లు కలిపి మొత్తం 1.4 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని తెలిపింది.
ఈ ఉద్యోగాల కోసం 2.4 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు
డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ ఆధారిత టెస్టులు (సీబీటీ)
జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కాబట్టి అభ్యర్థులు పోటీని గమనించి
సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉంది.
0 Komentar