Railway planning to remove Pantry Car
from Trains
రైల్వే ప్రయాణికులకు షాక్! ట్రైన్స్‌లో
ఇక ఫుడ్,
డ్రింక్స్ బంద్?
రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన
అలర్ట్. రైల్వే మంత్రిత్వ శాఖ ముందు ఒక కీలక ప్రతిపాదన ఉంది. బిగ్గెస్ట్ రైల్వే
ఎంప్లాయీస్ యూనియన్ ఒకటి ఈ ప్రతిపాదనను ఇండియన్ రైల్వేస్ ముందు ఉంచింది.
కీలక నిర్ణయం దిశగా ఇండియన్
రైల్వేస్
ట్రైన్స్‌లో ప్యాంట్రీ కార్స్
తొలగింపు ప్రతిపాదన
దీంతో ప్రయాణికులపై ఎఫెక్ట్
రైళ్లలో జర్నీ చేసే వారికి ఆహారం, టీ,
కాఫీ వంటివి బంద్ కానున్నాయా? ఇండియన్
రైల్వేస్ ప్యాంట్రీ సర్వీసులను నిలిపివేయనుందా? వెలువడుతున్న
నివేదికల ప్రకారం.. రైల్వేస్‌కు చెందిన ఒక పెద్ద యూనియన్ ఈ అంశంపై రైల్వే
మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. ప్యాంట్రీ కార్‌లను తొలగించాలని ఇందులో డిమాండ్
చేసింది. వీటి స్థానంలో మరిన్ని ప్యాసింజర్ కోచ్‌లను ఏర్పాటు చేయొచ్చని
సూచించింది.
ప్యాంట్రీ కార్‌లను తొలగించడం వల్ల
రైల్వే ఆదాయం పెరుగుతుందని యూనియన్ తెలిపింది. యూనియన్ డిమాండ్ చేస్తున్న ఈ అంశంపై
ఇండియన్ రైల్వేస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో తెలియాల్సి ఉంది. అయితే ఇండియన్
రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం పడే
అవకాశముంది.
ఆల్ ఇండియా రైల్వేమెన్స్
ఫెడరేషన్ ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖకు ఒక సిఫార్సు చేసింది. ట్రైన్స్ నుంచి
ప్యాంట్రీ కార్‌లను తొలగించాలని కోరింది. మీడియా నివేదిక ప్రకారం.. ప్రయాణికులకు
ఆహారాన్ని బేస్ కిచెన్ నుంచి కూడా సరఫరా చేయొచ్చని తెలియజేసింది. ప్యాంట్రీ కార్
వల్ల ఇండియన్ రైల్వేస్‌కు ఎలాంటి ఆదాయం రావడం లేదని పేర్కొంది.
ఇకపోతే ఇండియన్ రైల్వేస్ ప్యాంట్రీ
కార్‌లను తొలగించకపోవచ్చని రైల్వే బోర్డు మాజీ చైర్మన్ ఆర్‌కే సింగ్ తెలిపారు.
అయితే ఒకవేళ వీటిని తొలగిస్తే రైల్వే స్టేషన్లలో బేస్ కిచెన్ ద్వారా ప్రయాణికులకు
ఆహారం అందించొచ్చని పేర్కొన్నారు. అయితే ఇండియన్ రైల్వేస్ ఏ నిర్ణయం తీసుకున్నా
కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా చూసుకుంటుందని వివరించారు.
0 Komentar