Railways issues guidelines for
travellers ahead of festive season, violation may lead to strict penalty
రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ఈ
రూల్స్ అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలుకు.. భారీ జరిమానా!
రైల్వే ప్రయాణం చేయడానికి రెడీ అవుతున్నారా? అయితే మీకు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. లేదంటు జైలుకు పోవాల్సి వస్తుంది.
ట్రైన్ జర్నీ చేసే వారికి హెచ్చరిక
రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే
అలాగే భారీ జరిమానాలు కూడా
పండుగకు ట్రైన్ జర్నీ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇండియన్ రైల్వేస్ కరోనా వైరస్ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. మీరు ఇవి ఏంటివో తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. జరిమానాలు చెల్లించుకోవాలి. టైమ్ బాగోలేకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు.
ఇండియన్ రైల్వేస్ పండుగ సీజన్ నేపథ్యంలో మరో 392 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ప్రయాణికులు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రూల్స్‌ను కూడా కఠినతరం చేసింది. ఈ రూల్స్‌ను ప్యాసింజర్లు అతిక్రమిస్తే జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. జరిమానా కూడా పడుతుంది.
ట్రైన్‌లో జర్నీ చేసే వారు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకోకపోయినా లేదంటే సరిగ్గా పెట్టుకోకపోయినా జరిమానా పడుతుంది. రైల్వే పోలీస్ ఫోర్స్ పండుగ సీజన్ నేపథ్యంలో ఈమేరకు కఠిన నిబంధనలను జారీ చేసింది. ఇంకా ప్రయాణికులు వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం కూడా పాటించాల్సి ఉంటుంది.
కరోనా టెస్ట్ ఫలితాలు పెండింగ్‌లో ఉన్న వారు, లేదంటే కరోనా వైరస్ ఉన్న వారు రైల్వే స్టేషన్లలో ఉండటం లేదా ట్రైన్స్‌లో జర్నీ చేయడం శిక్షార్హం. ఇలా చేస్తే ప్రయాణికులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా పబ్లిక్ ప్లేస్‌ల్లో ఉమ్మివేయడాన్ని కూడా క్రైమ్ కిందకే పరిగణలోకి తీసుకుంటారు. శిక్ష ఎదుర్కోవలసి వస్తుంది.
కోవిడ్ 19
వ్యాప్తికి కారణమైన వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని రైల్వే పోలీస్ ఫోర్స్
తెలిపింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 145, 153, 154 కింద
వీరిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. ఏకంగా నెల రోజుల నుంచి ఐదేళ్ల వరకు జైలు
శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలిపింది. అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తగా
ఉండాలని సూచించింది.
0 Komentar