Rare Halloween Blue Moon to Appear on
October 31 After 19 Years
నీలి రంగులో చందమామ దర్శనం...
ఎన్ని గంటల పాటు మన దేశంలో ఉంటుందంటే...!
2020 సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. ఈరోజున నీలి రంగు చందమామ(బ్లూ
మూన్) ఆకాశంలో కనివిందు చేయబోతోంది. ఈ శుభవార్తను నాసా ఇటీవలే చెప్పింది
అక్టోబర్ 31వ
తేదీన ఆకాశంలో చందమామ అత్యంత ఎక్కువ కాంతితో.. సాధారణ పరిమాణం కంటే మరింత పెద్ద
పరిమాణాంలో కనిపించబోతోందట. అక్టోబర్ 1వ తేదీన ఇలాంటిది
వచ్చిందంట.. కానీ ఇది అంతకంటే ఎక్కువ వెలుగుతో కనిపించనుంది.
ఈ సారి కనిపించే నీలి రంగు చందమామ
మరింత పెద్దగా కనిపించనున్నాడట. చాలా దేశాల్లో ఈ బ్లూ మూన్ ని చాలా దేశాల్లో హంటర్
మూన్ అని కూడా పిలుస్తారట. సాధారణంగా ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు
ఇలాంటి అద్భుతాలు జరుగుతాయంట. ఇలాంటి అరుదైన సంఘటన గురించి.. బ్లూ మూన్ గురించి
మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
నీలి రంగు చందమామ అంటే..
బ్లూ మూన్ అంటే చాలా మంది చంద్రుడు
నీలి రంగులో కనిపిస్తాడని అనుకుంటారు. కానీ National Aeronautics and Space
Administration(NASA) ప్రకారం, సాధారణంగా
ఆకాశంలో చంద్రుడు పసుపు మరియు తెలుగు రంగులో కనిపిస్తాడు. అయితే బ్లూ మూన్ అని
పిలుస్తారంటే.. అక్టోబర్ 31వ తేదీ నుండి కొన్ని గంటల వరకు
చంద్రుడు రెగ్యులర్ కంటే భిన్నంగా కనిపించనున్నాడు. అది కూడా నీలి రంగులో
ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లూ మూన్ ఒక అసాధారణ ఖగోళ ద్రుగ్విషయం. ఇది ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి కనిపిస్తుంది. కానీ 2020 సంవత్సరంలో
కనిపించే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. ఈ సమయంలో అమెరికాలో చంద్రుడిని చూస్తూ తోడేళ్లు
అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మంచు కురుస్తూ.. వాతావరణం నలుపు, నీలి
రంగులో ఉంటుంది. అందువల్ల దీనికి బ్లూ మూన్ అని పేరు పెట్టారు. ఇది మళ్లీ 2039లో మాత్రమే కనిపిస్తుంది.
ఇంతకుముందు ఎప్పుడొచ్చింది..
ఈ నీలి రంగులో ఉండే చందమామ ఇంతకుముందు సుమారు 137 సంవత్సరాల క్రితం, 1883 సంవత్సరంలో, నీలి చంద్రుడిని చూసే అవకాశం ప్రజలకు లభించింది. వాస్తవానికి, అగ్నిపర్వతం క్రాకోటా విస్ఫోటనం కారణంగా, దుమ్ము కణాలు గాలిలో కరగడం కారణంగా చంద్రుడు నీలం రంగులో కనిపించడం ప్రారంభించాడు. ఇప్పుడు విశేషమేమిటంటే.. ఈరోజున నీలి చంద్రుడు కనిపించనున్నాడు. కానీ అది ఖగోళ సంఘటన కాదు.
రెండో పౌర్ణమిని.. బ్లూ మూన్ అని..
సాధారణంగా ఒకే నెలలో రెండుసార్లు
పౌర్ణమి వచ్చినప్పుడు.. రెండోసారి వచ్చే పౌర్ణమిని నీలి చందమామ (బ్లూ మూన్) అని
అంటారు.
నీలి చంద్రుడు ఎప్పుడు
కనిపిస్తాడు..
నీలి రంగు చందమామ(బ్లూ మూన్)
అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5:45 నుండి రాత్రి
8:18 గంటల వరకు కనిపించనున్నాడు. అయితే అక్టోబర్ 31వ తేదీన రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుందని..అప్పుడు నీలి రంగులో చందమామ
స్పష్టంగా కనిపిస్తాడని, ఆ సమయంలో టెలిస్కోప్ సహాయంతో నీలి
చంద్రుడిని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్లూ మూన్ గ్రహణం కాదా?
కొందరు బ్లూ మూన్ అంటే గ్రహణం అని
అనుకుంటారు. కానీ చంద్ర క్యాలెండర్ ప్రకారం ఒక పౌర్ణమి నుండి మరో పౌర్ణమికి దూరం 29.5 రోజులు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా, గ్రెగోరియన్
క్యాలెండర్ ఉపయోగించబడుతుంది, అంటే నెల వ్యవధి 28 నుండి 31 రోజులు, కాబట్టి
పౌర్ణమి నెలకు రెండుసార్లు సంభవిస్తుంది. భూమి యొక్క సౌర వ్యవస్థ మరియు భూమి
చుట్టూ చంద్ర కక్ష్య మధ్య గ్రహణం జరగదు. కాబట్టి బ్లూ మూన్ అంటే గ్రహణం కాదు.
0 Komentar