Rationalization and Teachers transfers Process
Temporarily Postponed
టీచర్ల హేతుబద్ధీకరణ, బదిలీల
ప్రక్రియ తాత్కాలిక వాయిదా
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలను
నవంబరు రెండో తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా చేసింది. ముందుగా
ప్రకటించిన షెడ్యూల్ మేరకు హేతుబద్ధీకరణ ప్రక్రియ అక్టోబర్ 26 వ తేదీతోనే ముగియాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చిన
వీరభద్రుడుతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మంగళవారం సమావేశమై పలు
అంశాలపై చర్చించారు. అక్టోబరు 31 వరకు ఉండే విద్యార్థుల
ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకొని హేతుబద్ధీకరణ, బదిలీ లను
చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విన్నవించింది. దీనికి అంగీకరించిన సంచాలకులు
నవంబరు రెండో తేది వరకు ప్రక్రియను వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే
ప్రకటిస్తారు.
0 Komentar