Rules for JOSAA -2020-21 Academic Year
జోసా నియమ నిబంధనలు
1. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ అలాగే ప్రభుత్వ నిధులతో నడుస్తున్న
మరి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులం దరూ సీటు
కోసం 'జోసా (జాయింట్ సీటు ఆలకేషన్ అథారిటీ) - 2020 ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. జండర్, స్టేట్
కోడ్ వంటి సాధారణ అంశాలను మళ్ళీ కన్ఫర్మ్ చేయడం ద్వారా విద్యార్థులు చాలా సులువుగా
ఈ ప్రక్రియలో చేరవచ్చు.
2. మొదటి రౌండ్లో సీటు అలాట్
కాగానే అందుకు ఆమోదం తెలపాలి. అలా చేస్తేనే, తుది రౌండ్ వరకు
కొనసాగే అర్హత లభిస్తుంది. నిర్దేశిత లింక్ http://josaa.nic.in ద్వారా ఫీజు చెల్లించాలి. అదే విధంగా అడిగిన డాక్యుమెంట్లను కూడా వెంటనే
అప్లోడ్ చేయాలి. తద్వారా మొదటి రౌండ్లో కేటాయించిన సీటుకు ఆమోదం తెలియజేయాలి. అదే
తదుపరి రౌండ్లలో పాల్గొనేందుకు అర్హతను కల్పిస్తుంది.
3. అవసరమైన డాక్యుమెంట్లను
అప్లోడ్ చేసేందుకు, ఫిర్యాదులపై స్పందన, వెరిఫికేషన్లు ఇచ్చే గడువు స్పష్టంగా ఉంటుంది. ఆ నిబంధనలను తు.చ.
తప్పకుండా పాటించాలి. అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉండాలి.
ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేందుకు లింక్ను తరచూ వెరిఫై చేస్తుండటం ఒక్కటే మార్గం.
4. రెండో రౌండ్ నుంచి అయిదో
రౌండ్ వరకు ఎప్పుడైనా సరే, సీటు కేటాయింపు ప్రక్రియ నుంచి
విద్యార్థి తప్పుకోవచ్చు. నవంబర్ 6 తర వాత ప్రాసెస్ నుంచి తప్పుకొనే వీలు ఉండదు.
5. ఐఐటీలో చేరేందుకు ఆరో
రౌండ్లో తొలిసారి సీటు పొందిన విద్యార్థులకు మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్,
ఫీజు చెల్లింపు వంటివి చేరే సమయంలో ఉంటాయి.
6. అదే NIT తదితర సంస్థల్లో చేరబోయే విద్యార్థులు ఆరో రౌండ్ పూర్తి కాగానే భౌతికంగా
సదరు ఇన్స్టిట్యూటకు వెళ్ళి చేరాల్సి ఉంటుంది. అయితే అప్పటి పరిస్థితులు అనుకూ
లంగా లేకుంటే, ఆన్లైన్లోనే ప్రక్రియను ముగించే అవకాశం
ఉంటుంది.
7. ఐఐటీ సహా జోసా ప్రక్రియలో
పాల్గొనే వివిధ సంస్థల అకడమిక్ వివరాలన్నీ వెబ్ సైట్లో లభిస్తాయి.
8. కంప్యూటర్ సేవల బ్రేక్ డౌన్
వంటి అవాంతరాలు తమ దృష్టికి రాగానే వాటిని సరిదిద్దే ప్రయత్నానికి జోసా కమిటీ
పూనుకుంటుంది.
0 Komentar