Scholarships for children of workers -
Central Labor Welfare Agency invites applications
కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు - దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ
సినిమా, బీడీ
కార్మికుల పిల్లలతోపాటు సున్నపురాయి, మాంగనీసు, ఇనుప గనుల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు
కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి
విద్యార్థులు ప్రీ మెట్రిక్ కేటగిరీలో, 11వ తరగతి నుంచి
వృత్తివిద్య కోర్సుల వరకు పోస్ట్ మెట్రిక్ విభాగంలో అక్టోబరు 31 వరకు జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని హైదరాబాద్‌లోని కార్మిక సంక్షేమ సంస్థ
కమిషనర్(సంక్షేమం) రమేశ్‌కుమార్ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని
ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలు, కాలేజీల్లో
చదివే విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి ఆర్థిక సాయం
కోసం దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం జాతీయ ఉపకార వేతనాల
పోర్టల్‌ను పరిశీలించాలన్నారు. దరఖాస్తులకు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలను
జాతీయస్థాయిలో helpdesk@nsp.gov.in కు మెయిల్ లేదా 0120-6619540కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. స్థానికంగా అయితే
హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని కార్మిక సంక్షేమ సంస్థను 040-24658026 నంబరులో లేదా wlcwohyd@ap.nic.in లో
సంప్రదించవచ్చన్నారు.
0 Komentar