School closures due to Covid-19 to cost India over 29 lakh crores: World Bank
స్కూళ్ల మూసివేతతో భారత్‌కు
ఇన్ని కోట్లు నష్టమా..? వరల్డ్ బ్యాంక్ షాకింగ్ రిపోర్ట్..!
ఇండియాలో స్కూళ్ళు మూసివేసిన
ఫలితంగా భారీ నష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ నెల నుంచి మనదేశంతో పాటు పలు దేశాల్లో స్కూళ్లు మూతబడిన సంగతి తెలిసిందే. దీంతో విద్యారంగం.. అకడమిక్ ఇయర్ నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా నష్టం భారీస్థాయి నష్టాలే చవిచూడాల్సి వచ్చినట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో స్కూళ్ళు మూసివేసిన ఫలితంగా భారీ నష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
విద్యా సంస్టలు మూసివేయడంతో భారత్ సుమారు 400 బిలియన్ డాలర్లుకు (29 లక్షల కోట్లు) పైగా ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. విద్యార్థుల్లో చదవాలన్న లేదా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు అని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. దక్షిణాసియా మొత్తానికి 622 బిలియన్ డాలర్లు లేక ఇది మరింత పెరిగి 880 బిలియన్ డాలర్ల నష్టానికి కూడా చేరవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజాగా ‘బీటెన్ ఆర్ బ్రోకెన్.. ఇన్ ఫర్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌతిండియా’ పేరిట ఈ నివేదికను రిలీజ్ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా సుమారు 50 లక్షల మందికి పైగా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గానే మిగిలిపోవచ్చు అని కూడా ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొనడం విశేషం. ఇది ఒక తరం విద్యార్థుల ఉత్పాదకతపై జీవితకాల ప్రభావాన్ని చూపుతుందని స్పష్టం చేసింది. ఏదేమైనా కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
0 Komentar