World Space Week (WSW) 2020 via Online
platform from 4th to 10th Oct, 2020
ఆన్లైన్లో అంతరిక్ష వారోత్సవాలు-2020
ప్రతి ఏటా నిర్వహించే అంతరిక్ష
వారోత్సవాలను ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ
తేదీ వరకు ఆన్లైన్ (వెబినార్)లో నిర్వహించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
(ఇస్రో) నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇస్రో గత 20 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో పదో తరగతిలో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను
వారి తల్లిదండ్రులతో సహా పిలిపించి, వారికి అంతరిక్ష
కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాల వివరాలను http//www.shar.gov.in
వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది.
SDSC SHAR ప్రపంచ అంతరిక్ష
వారోత్సవం (WSW) 2020 ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా 2020 అక్టోబర్ 4 నుండి 10 వరకు
ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు
మరియు తెలంగాణలో 4 రాష్ట్రాలలో జరుపుకోనుంది. శ్రీహరికోటలో
ప్రారంభోత్సవంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
0 Komentar