Sonu Sood launches scholarship for IAS aspirants in memory of his mother
తల్లి పేరిట సోనూ సూద్ స్కాలర్‌షిప్..
ఐఏఎస్ ఆశావాహులకు గుడ్ న్యూస్
పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్.. ఐఏఎస్‌లు కావాలని ఆశపడే పేద విద్యార్థులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.
నటుడు సోనూ సూద్ ఈ లాక్‌డౌన్
సమయంలో ఎంతో సామాజిక సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులను
ఆదుకున్నారు.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పించారు.. చిన్నపిల్లలకు
గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం
చుట్టారు. తన తల్లి పేరిట స్కాలర్‌షిప్స్ అందించడానికి ముందుకొచ్చారు. అది కూడా
ఐఏఎస్ కావాలని కలలుగనే పేద విద్యార్థుల కోసం. తన తల్లి సరోజ్ సూద్ 13వ
వర్థంతి సందర్భంగా సోనూ ఈ ప్రకటన చేశారు.
‘‘అక్టోబర్ 13; నా తల్లి మృతిచెంది నేటికి 13 ఏళ్లు. విద్యా వారసత్వాన్ని
వదిలిపెట్టి ఆమె వెళ్లిపోయారు. ఈ రోజు ఆమె వర్థంతిని పురష్కరించుకుని ప్రొఫెసర్
సరోజ్ సూద్ స్కాలర్‌షిప్స్ ద్వారా ఐఏఎస్ ఆశావాహులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి
ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీ ఆశీర్వాదాలు కావాలమ్మా’’ అని సోనూ
సూద్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇదే సమయంలో తన తల్లిని తాను ఎంత
మిస్ అవుతున్నానో తెలుపుతూ మరో ఎమోషనల్ ట్వీట్ చేశారు సోనూ సూద్. ‘‘13
ఏళ్ల క్రితం ఇదే రోజు, అక్టోబర్ 13న
జీవితం నా చేతుల్లో నుంచి జారిపోయింది. అమ్మా’’ అని తన తల్లి పాత ఫొటోను షేరు
చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
ఈ స్కాలర్‌షిప్ అప్లై చేయాలనుకుంటే https://scholifyme.com/, లేదా Scholify యాప్ ని ఇన్ స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లై చేయండి.
0 Komentar