Staff Selection Commission Stenographer Grade C, D Exam - 2020: Results Released Notification
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఎస్ఎస్‌సీ-
స్టెనోగ్రాఫర్ ఫలితాలు విడుదల
=======================
UPDATE
24-09-2022
స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి & డి
ఎగ్జామినేషన్-2020కు సంబంధించి స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్
కమిషన్(ఎస్ఎస్ సీ) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. జూన్ 20, 21 తేదీల్లో స్టెనోగ్రాఫర్ పరీక్ష స్కిల్ టెస్టు ఎస్ఎస్ సీ నిర్వహించింది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, స్టెనోగ్రాఫర్
గ్రేడ్ 'డి' పోస్టులకు 13445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు హాజరయ్యారు. వీరిలో గ్రేడ్ 'సి' పోస్టులకు 227 మంది, స్టెనోగ్రాఫర్
గ్రేడ్ 'డి' పోస్టులకు 1982 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా
వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
STENOGRAPHER
GRADE ‘C’ RESULTS
STENOGRAPHER
GRADE ‘D’ RESULTS
=======================
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) వివిధ మంత్రిత్వశాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 04 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన
ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.08.2020 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30
ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27
ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షతేది: 29.03.2021 నుంచి 31.03.2021 వరకు జరుతాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 04, 2020.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
0 Komentar