TCS iON opens NQT-2020 to all firms for
hiring of freshers
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ)
2020 ప్రకటన విడుదల
ఈ పరీక్షలో అర్హత సాధిస్తే..
టీసీఎస్‌తో పాటు ప్రఖ్యాత ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సొంతం
చేసుకోవచ్చు.
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ)
2020 ప్రకటన విడుదల
యూజీ, పీజీ
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈనెల 17
దరఖాస్తుకు చివరితేది
టీసీఎస్ అనుబంధ సంస్థ అయిన
టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ) ప్రకటన విడుదల చేసింది.
ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా పలు కార్పొరేట్ సంస్థల్లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్లను
చేపడుతారు. ఈ టెస్ట్‌లో ఎంట్రీ లెవల్ జాబ్స్‌కు కంపెనీలు అభ్యర్థి నుంచి ఆశించే
సంబంధించి కాగ్నిటివ్ ఎబిలిటీస్‌ను ఈ ఎన్‌క్యూటీలో పరీక్షిస్తారు.
ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌కు
రెండేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు వారి ఇంటి నుంచే ఈ పరీక్ష రాయవచ్చు.
ఒకవేళ పరీక్షకు అవసరమైన సౌకర్యాలు లేకుంటే దగ్గరలోని టీసీఎస్ అయాన్ సెంటర్లలో
పరీక్ష రాయవచ్చు. ప్రతి మూడునెలలకోసారి ఎన్‌క్యూటీ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం:
రిజిస్ట్రేషన్లకు చివరితేది:
అక్టోబరు 17
పరీక్ష తేదీలు: అక్టోబరు 24, 25, 26
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశ పత్రాలు: పరీక్షకు రెండు
రోజుల ముందు అభ్యర్థుల ఈ-మెయిల్‌కు అందుతాయి.
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంఈ/
ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, డిగ్రీ వీటిలో ఏదైనా కోర్సు ఫుల్ టైమ్ విధానంలో చివరి ఏడాది
చదువుతున్నవారు (2021లో పూర్తి చేసుకోబోతున్నవారు) అర్హులు.
ఇంజినీరింగ్ అన్ని బ్రాంచ్‌లూ, ఎమ్మెస్సీ అన్ని విభాగాల
వారూ ఈ పరీక్ష రాసుకోవచ్చు. అయితే సంబంధిత కోర్సులను రెగ్యులర్ విధానంలో
చదివుండాలి. పది, ఇంటర్ మాత్రం ఓపెన్ స్కూల్ విధానంలో
చదివినప్పటికీ అర్హులే.
అకడమిక్ మార్కుల శాతం: పది, ఇంటర్/
డిప్లొమా, యూజీ/ పీజీ అన్నింటా కనీసం 60 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏ తప్పనిసరిగా ఉండాలి.
బ్యాక్ లాగులు: ప్రస్తుతానికి
ఒకటి కంటే ఎక్కువ ఉండరాదు. అదీ నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి.
గ్యాప్‌లు: విద్యాభ్యాసం మొత్తంమీద
రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండరాదు. అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉన్నవారి విషయంలో
అందుకు బలమైన కారణం (అనారోగ్యం, ప్రమాదాలు.. మొదలైనవి) ఆధారాలతో
చూపగలిగితే పరిగణనలోకి తీసుకుంటారు.
రిజిస్ట్రేషన్‌కు డైరెక్ట్ లింక్: https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/
0 Komentar