Telangana Fee Reimbursement Post matric
Scholarship 2020-21
విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌లకు
దరఖాస్తు చేసుకోండి..!
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ నేటి (అక్టోబర్ 14) నుంచి ప్రారంభం కానుంది.
కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థుల (ఫ్రెషర్స్)తో పాటు రెన్యువల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. అర్హులైన పోస్టుమెట్రిక్ విద్యార్థులంతా ఈ-పాస్ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని.. డిసెంబర్ 31 నాటికి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో తప్పకుండా సమర్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు.
కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ-పాస్ నమోదుపై ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
0 Komentar