Telugu University Distance Education
Courses Admission Notification 2020-21
తెలుగు వర్సిటీ దూరవిద్య
కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
తెలుగు యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల
చేసింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా 2020-21 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.teluguuniversity.ac.in/ లేదా www.teluguuniversity.ac.in/ వెబ్‌సైట్లు చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
పీజీ డిప్లొమా కోర్సులు: టీవీ జర్నలిజం, జ్యోతిషం
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై
ఉండాలి.
డిప్లొమా కోర్సులు: లైట్ మ్యూజిక్, ఫిలిమ్
రైటింగ్, జ్యోతిషం
అర్హత: పదో తరగతి, ఇంటర్
ఉత్తీర్ణులై ఉండాలి. ఫిలిమ్ రైటింగ్ కోర్సుకు తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
సర్టిఫికెట్ కోర్సులు: జ్యోతిషం, సంగీత
విశారద, మోడ్రన్ తెలుగు
అర్హత: పదో తరగతి
ఉత్తీర్ణులై ఉండాలి. సంగీత విశారద కోర్సుకు 12 ఏళ్లు నిండిన వారై
ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్
విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 31, 2020
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్
30,
2020
వెబ్‌సైట్: http://www.teluguuniversity.ac.in/
లేదా www.teluguuniversity.ac.in/
0 Komentar